తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డ్ నౌ మంచి ఫలితాలను ఇస్తోంది. కేసీఆర్ హయాంలో తీసుకు వచ్చిన S-bPASS సిస్టమ్‌ను ‘BuildNow’గా మార్చి ఫిబ్రవరి 2025 నుంచి అమలులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇది భవన అనుమతుల ప్రక్రియను మరింత సరళీకరిస్తూ, మల్టీ-స్టోరీ భవనాల అనుమతుల సమయాన్ని వారాల నుంచి గంటల్లోకి తగ్గించింది.
TS-bPASS, 2021లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమల్లోకి తెచ్చారు. ఆన్లైన్ పోర్టల్, భవనాలు, లేఅవుట్ అనుమతుల ప్రక్రియను డిజిటలైజ్ చేసింది. ఇది తెలంగాణ మున్సిపలిటీస్ చట్టం 2019 ప్రకారం, సెల్ఫ్-సర్టిఫికేషన్ ఆధారంగా 21 రోజుల్లో అనుమతులు ఇవ్వడానికి రూపొందించారు. కానీ, మల్టిపుల్ ప్లాట్‌ఫామ్‌ల మధ్య స్విచింగ్, కాంప్లెక్స్ ప్రాజెక్టుల్లో 2-30 రోజుల డిలేలు సవాళ్లుగా మారాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ ప్రభుత్వం బిల్డ్ నౌ తీసుకు వచ్చింది.
బిల్డ్ నౌ ద్వారా వేగవంతమైన అప్రూవల్స్ లభిస్తున్నాయి. మూడు టవర్లు ఉన్న కాంప్లెక్స్ ప్రాజెక్టులకు 2 నిమిషాల్లో స్క్రూటినీ చేస్తుంది. TGRERA, సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (TDR)తో లింక్ అయి ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్, ఫీ సబ్మిషన్, ట్రాకింగ్. ఆర్కిటెక్టులు, అధికారులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు కూడా ఉంటాయి.
అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నవారికి ఇప్పుడు ఇళ్ల అనుమతులు పెద్ద సమస్య కాదు. బిల్డ్ నౌ బిల్డర్లు పనులు చాలా వరకూ ఈజీ చేసింది.
