జోరుగా వాహనాలు కొనుగోలు: తెలంగాణ ఖజానాకు తూట్లు

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిననాటినుంచి కొట్టొచ్చినట్లు కనబడుతున్న మార్పు ఏదైనా ఉందీ అంటే అది – తళతళలాడుతున్న కొత్త ప్రభుత్వ వాహనాలు. ముఖ్యమంత్రి దగ్గరనుంచి కానిస్టేబుల్ వరకు అందరూ కొత్త వాహనాలు తప్పితే మరోదానికి ససేమిరా అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి మూడుసార్లు కాన్వాయ్ మార్చి మొన్నీ మధ్యే కోటిన్నర చొప్పున కొన్న ఐదు రేంజ్ రోవర్ వాహనాలకు సెటిల్ అయ్యారు. ఇదికాక ఐదుకోట్లతో కొనుగోలు చేసిన బెంజ్ కంపెనీ లగ్జరీ బస్సు ఉండనే ఉంది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత చందాన, మన ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా వాహనాల కొనుగోలును ఉద్యమస్థాయిలో చేపట్టారు. ఇక పోలీస్ శాఖ గురించి చెప్పేదేముంది. ప్రభుత్వం కొలువు తీరగానే, తెలంగాణ పోలీస్ శాఖకు కొత్త ఇమేజ్, కొత్త రూపురేఖలు తీసుకురావాలంటూ కేసీఆర్ దొరగారు కొత్త వాహనాలకోసం రు.312 కోట్లు మంజూరు చేశారు. వీటితో 694 ఇన్నోవాలు, 260 బొలేరోలు, 426 టాటా సుమోలు, 500 బైకులు కొనుగోలు చేశారు. ఐపీఎస్‌లకు టొయోటో ఫార్చ్యూనర్ వాహనాలను కొన్నారు. ఇక అటవీశాఖకు రు.28.86 కోట్లతో కొత్త వాహనాలను కొనుగోలు చేశారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌లందరికీ ఇన్నోవాలు మంజూరయ్యాయి. జిల్లా పరిషత్‌లోని ఉన్నతాధికారులకుకూడా రు.13 నుంచి రు.16 లక్షల రేంజ్‌లో కొత్త వాహనాలను కొనుగోలుచేశారు.

ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలుకూడా వాహనాల కొనుగోలులో పోటీపడుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ కేటీఆర్ కింద ఉన్న సంగతి తెలిసిందే. పంచాయతీ రాజ్ శాఖవారి వాహనాల కొనుగోలు ఎంత దూకుడుగా ఉందంటే, ఇంకా శాంక్షన్ కాని పోస్టులకోసంకూడా ఇప్పుడే వాహనాలు కొనేసేటంత. పంచాయతీరాజ్ శాఖలో మంజూరుకాబోయే పోస్టులకోసమంటూ జీవో నంబర్ 87 ద్వారా వాహనాలు కొనుగోలుకు మార్గం సుగమం చేసినవైనం ఇటీవల బయటకొచ్చింది. మరోవైపు ఆర్థికశాఖలో ఉన్నతాధికారులు రు.30.70 లక్షల చొప్పున కొరోలా ఆల్టిస్, ఇన్నోవా వాహనాల కొనుగోలుకోసం నిధులు విడుదలయ్యాయి. మరిన్న ప్రభుత్వశాఖలనుంచి వాహనాల కొనుగోలుకోసం ఇండెంట్‌లు తయారయ్యాయట. వీటికి పర్చేజ్ ఆర్డర్‌లు ప్రస్తుతం తయారవుతున్నాయని తెలిసింది.

ఎప్పుడూ ఫీల్డ్‌లో తిరుగుతూ ఉండే పోలీస్, ఫారెస్ట్ శాఖలకోసం వాహనాల కొనుగోలు ఫరవాలేదని, మిగిలిన ప్రభుత్వ శాఖలలో ఐదేళ్ళుకూడా నిండని వాహనాలను పక్కనపెట్టి కొత్తవి కొనుగోలు చేస్తున్నారని కొందరు అధికారులు వాపోతున్నారు. జీహెచ్ఎమ్‌సీ, ఫైర్ సర్వీసెస్ వంటి శాఖలలో ఎన్నో ఏళ్ళనాటి పాత వాహనాలను వాడుతుంటే వాటిని మార్చే దిక్కులేదనికూడా వారు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ తన ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇలా కొత్తవాహనాలను సంతర్పణ చేసుకుంటూపోతే ధనిక రాష్ట్రంకాస్తా పేదరాష్ట్రం కావటానికి ఎంతో సమయంపట్టదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close