తెలంగాణకు కరోనా లేదా..? పోల్చుకుంటే తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ దేవుడే !

ప్రపంచం అంతా కరోనా ఉంది. తెలంగాణకూ ఉంది.అయితే తెలంగాణ ఉద్యోగులకు మాత్రం బాధ్యతగా కల్పించాల్సిన ప్రయోజనాల్ని కేసీఆర్ కల్పిస్తున్నారు. కరోనా కారణంగా పెండింగ్‌లో పెట్టిన డీఏలను విడుదల చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మూడుడీఏలను విడుదల చేశారు. దీంతో వారి జీతం మరింత పెరగనుంది. ఆదాయం ఇప్పుడు సాధారణ స్థితికి రావడంతో నిర్ణయం తీసుకున్నారు.

పీఆర్సీ కమిటి 7 శాతం సిఫార్సు చేస్తే 30 శాతం ఇచ్చిన కేసీఆర్ !

ఉద్యోగుల విషయంలో కేసీఆర్ ఏపీతో పోలిస్తే చాలా ఔదార్యం పాటిస్తున్నారు. ఎందుకంటే పీఆర్సీ కమిటీ ఉద్యోగులకు కేవలం ఏడు శాతమే ఫిట్‌మెంట్ సిఫార్సు చేసింది. కానీ కేసీఆర్ ఏకంగా ముఫ్పై శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 43శాతం ఇచ్చారు. ఐదేళ్లలోనే మరో ముఫ్పై శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఉద్యోగుల జీతాలు ద్రవ్యోల్బణం ప్రకారం పెరిగాయి. ఉద్యోగులు కూడా సంతృప్తి చెందారు. ఏపీలో అయితే అసలు పీఆర్సీ కమిటీ కోసం నియమించిన అశుతోష్ మిశ్రా నివేదికను అసలు బహిర్గతమే చేయలేదు. కార్యదర్శుల కమిటీ ఏర్పాటుచేసి.. వాటితోనే 14 శాతం సిఫార్సు చేయించి.. అంత కన్నా ఎక్కువగా 23 శాతం ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంది.కానీ ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఉంది. ఐఆర్ కన్నా తక్కువ ఇచ్చి.. జీతాలు తగ్గించేసి మాయమాటలు చెబుతోంది.

డీఎలు కాస్త ఆలస్యమైనా పీఆర్సీతో కలపని కేసీఆర్ !

డీఏలు అంటే.. డియర్‌నెస్ అలవెన్స్. ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు అంతో ఇంతో జీతం పెరగడానికి ఇది సాయపడుతుంది. స్వల్ప మొత్తమే అయినా… దీర్ఘకాలంలో చూసుకుంటే బేసిక్‌మీద ఈ అలవెన్స్ ఆదాయంలో బాగానే కనిపిస్తుంది. దీనికి పీఆర్సీకి అసలు సంబంధం లేదు. దానికి తగ్గట్లుగానే కేసీఆర్ కొన్ని డీఏలు పెడింగ్‌లో ఉన్నప్పటికీ.. పీఆర్సీ సమయంలో దాన్ని కలిపేసి.., జీతం పెంచుతున్నానని ప్రకటించుకోలేదు. డీఏలు.. డీఏలుగానే ఉంచారు. ఉద్యోగుల్ని మభ్యపెట్టలేదు. కానీ ఏపీలో మాత్రం ఏకంగా ఆరేడు డీఏలు పెండింగ్‌లో పెట్టి.. ఇప్పుడు పీఆర్సీలో జీతం కట్ చేసి.. అన్ని డీఏలు ఇస్తున్నట్లుగా చెప్పి కవర్ చేశారు. జీతం తగ్గడం లేదని .. గొప్ప సాయం చేశామన్నట్లుగా ప్రకటిస్తున్నారు. ఇది ఉద్యోగుల ఆగ్రహానికి కారణం అవుతోంది.

కేంద్రం పేరుతో ఉద్యోగుల ప్రయోజనాల్ని లాక్కోని కేసీఆర్ !

కేంద్ర పీఆర్సీనే ఇక నుంచి పాటిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. పదేళ్లకు ఓ సారి పీఆర్సీ ఇస్తామని అలాగే.. క్వాంటమ్ పెన్షన్, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ లాంటి ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ కత్తిరించేసింది. కానీ కేసీఆర్ మాత్రం ఎన్ని ఆర్థిక కష్టాలున్నా.. ఉద్యోగుల ప్రయోజనాల జోలికి మాత్రమే పోలేదు. ఉద్యోగుల విషయంలో ఆయన కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించినా ఇప్పుడు పొరుగు రాష్ట్ర సీఎం వ్యవహరిస్తున్న తీరుతో.. ఆయన నిజంగా దేవుడని ఉద్యోగులు అనుకునే పరిస్థితి వచ్చింది.

విభజన నాటి కంటే దారుణమైన ఆదాయం ఏపీకి ఉందా ?

ఆర్థికంగా ఏపీ సవాళ్లుఎదుర్కొన్న సమయం ఏదైనా ఉందా అంటే అది విభజన సమయమే. ఎంత ఆదాయం వస్తుందో లేదో తెలియని సమయం. అలాంటి సమయంలో ఉద్యోగులు నిరాశపడకూడదని.. అధిక ఆదాయం ఉన్న తెలంగాణ సర్కార్ ఇచ్చిన 43 శాతం ఫిట్‌మెంట్.. డీఏలను ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చారు చంద్రబాబు. హెచ్‌ఆర్‌ఏ సహా ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో వారిని ఎప్పుడూ ఇబ్బందిపెట్టలేదు. కానీ ఇప్పుడు అంతా బాగున్నా.. వారి జేబుకు చిల్లు పడినట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close