రకుల్‌ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఎందుకు ప్రయత్నిస్తారు..!?

బాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయాన్ని హైదరాబాద్‌కు చుట్టబెట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూండటంతో.. ఆమె పేరును లింక్ చేసి రాజకీయ ఆరోపణలు ప్రారంభించారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్.. ఈ విషయంలో చిత్రమైన ఆరోపణలు చేస్తూ.. మీడియాకు లేఖ పంపారు. ముంబై డ్రగ్స్‌ కేసుతో హైదరాబాద్‌కు లింకులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. గతంలో హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసును తొక్కేశారని గుర్తు చేశారు. అంతటితో ఆగలేదు.. రకుల్‌ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆరోపించారు.

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో చాలా మంది పేర్లు ఉంటే.. ఒక్క రకుల్‌ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఎందుకు ప్రయత్నిస్తున్నారో సంపత్ కుమార్ తన లేఖలో వివరించలేదు. తెలుగు సినిమాల్లో నటించినంత మాత్రాన రకుల్ ను కాపాడాలని.. తెలంగాణ ప్రభుత్వం అనుకోదుగా..! పైగా… రకుల్ తాను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పడం లేదు. రెండేళ్ల కిందట.. చాట్ చేశానని చెబుతోంది. అంతకు ముందు ఎన్సీబీ వద్ద ఆధారాలు కూడా లేవని … దర్యాప్తు అధికారులే చెబుతున్నారు. అటువంటప్పుడు.. కాపాడటం అనే ప్రశ్న ఎలా వస్తుందో.. సంపత్.. ఏ ఉద్దేశంతో ఈ లేఖ రాశారో స్పష్టత లేకుండా పోయింది.

తనపై ఇలాంటి రాజకీయాలు చేస్తారని రకుల్ ముందుగానే గ్రహించింది ఏమో కానీ.. డ్రగ్స్ కేసు విషయంలో తన పేరుతో ఎలాంటి వార్తలు వేయకుండా మీడియాను నియంత్రించాలని మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసును ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేశారు. బహుశా.. ఈ విషయాన్ని హైలెట్ చేయడానికి సంపత్ కుమార్ రకుల్ పేరును ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐపీఎల్ స్టోరీస్‌: చెన్నై అట్ట‌ర్ ఫ్లాప్ షోకి 6 కార‌ణాలు

ఎప్పుడూ లేనిది ఐపీఎల్ లో చెన్నై ముందే చేతులెత్తేసింది. ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్‌లోనూ చెన్నై త‌న పూర్తి స్థాయి ఆట‌తీరుని క‌న‌బ‌ర‌చ‌లేదు. మూడు మ్యాచ్‌ల‌లో గెలిచినా స‌రే, ఆ గెలిచిన మ్యాచ్‌ల‌లోనూ కొన్ని...

బోయ‌పాటి.. ఇంత లేటేంటి?

ఓవైపు క‌రోనా, మ‌రో వైపు వ‌ర్షాలు. షూటింగుల‌కు ఆటంకంగా మారాయి. స్టార్ హీరోలు సినిమా షూటింగుల‌కు సిద్ధంగా లేరు. చిరంజీవి, వెంక‌టేష్‌, సినిమాల షూటింగులు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. అన్నీ సిద్ధంగా ఉన్నా... హీరోలు...

పూజా హెగ్డే క‌ల తీరింది

బాలీవుడ్‌లో పాగా వేయాల‌ని ఎవ‌రికి ఉండ‌దు? ముఖ్యంగా సౌత్ ఇండియాలో రాజ్యం ఏలుతున్న క‌థానాయిక‌ల‌కు ఆ ఆశ‌లు ఇంకాస్త ఎక్కువ‌. ఆ అవ‌కాశాలు కొంత‌మందికి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోతుంటాయి. పూజా హెగ్డేకీ...

బీజేపీ నుంచి లంకా దినకర్ సస్పెన్షన్..!

భారతీయ జనతాపార్టీ నేత లంకా దినకర్‌ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆయనకు అధికార ప్రతినిధి పదవి ఇవ్వలేదు. అయితే వివిధ టీవీ చానళ్లలో ఆయన బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close