మార్చి 31 వ‌ర‌కూ తెలంగాణ లాక్ డౌన్

మార్చి నెలాఖ‌రు వ‌ర‌కూ తెలంగాణ లాక్ డౌన్ ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఆదివారం నాడు చూపించిన స్ఫూర్తితోనే నెలాఖ‌రు వ‌ర‌కూ ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని పిలుపునిచ్చారు. నిత్యావ‌స‌రాల స‌రకులు, కూర‌గాయ‌ల కోసం కుటుంబానికి ఒక‌రు చొప్పునే బ‌య‌ట‌కి రావాల‌న్నారు. ఐదుగురికి మించి ఎవ్వ‌రూ గుమిగూడి ఉండొద్ద‌నీ, ఒక‌వేళ ఎవ‌ర్నైనా క‌ల‌వాల్సి వ‌చ్చినా క‌నీసం మూడు అడుగుల దూరాన్ని పాటించాల‌న్నారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో మ‌న‌ల్ని మ‌న‌మే కాపాడుకోవాల‌న్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ మ‌రో ఐదు పాజిటివ్ కేసులు ఇవాళ్ల వ‌చ్చాయ‌న్నారు. ఈ ఐదుగురూ విదేశాల నుంచి వ‌చ్చిన‌వారే అన్నారు.

తెల్ల‌కార్డు ఉన్న‌వారికి వ్య‌క్తికి 12 కేజీల చొప్పున రేష‌న్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తామ‌ని కేసీఆర్ చెప్పారు. నిరుపేద‌ల‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామ‌న్నారు. పేద‌లు స‌రుకులు కొనుక్కునేందుకు ప్ర‌తీ రేష‌న్ కార్డుకీ రూ. 1500 న‌గదు ఇస్తున్నామ‌న్నారు. అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల ఉద్యోగులు 100 శాతం డ్యూటీల‌కు రావాల‌న్నారు. ఇత‌ర స‌ర్వీసుల్లో 20 శాతం చొప్పున రొటేష‌న్ చొప్పుడు విధుల‌కు హాజ‌రౌతార‌న్నారు. అన్ని ర‌కాల విద్యా సంబంధ కార్య‌క్ర‌మాలు మూసేస్తున్నామ‌ని చెప్పారు. ఈ వారం పాటు ఉద్యోగుల‌కు ప్రైవేటు కంపెనీలు కూడా జీతాలు చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు. ఇది సామాజిక బాధ్య‌త అన్నారు. వంద‌శాతం ప్ర‌జా ర‌వాణా బంద్ ఉంటుంద‌న్నారు. ట్యాక్సీలు, ఆటోలు అన్నీ బంద్ అన్నారు. అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దులు మూసేస్తున్నామ‌న్నారు. బయట్నుంచీ ఎవ్వర్నీ రానిచ్చేది లేదన్నారు. కానీ, కూర‌గాయ‌లు, మందులు తెచ్చే వాహ‌నాల‌కు అనుమ‌తి ఉంటుంద‌న్నారు.

ఈ ప్ర‌యాస అంతా ప్ర‌జ‌లు కొన్నాళ్ల‌పాటు ఇంటికే ప‌రిమితం చెయ్యాల‌న్న‌దే అన్నారు ముఖ్య‌మంత్రి. ఇలాంటి ప‌రిస్థితులో అంద‌రం బాధ్య‌తాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్ర‌భుత్వానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌న్నారు. ఇది పౌర బాధ్య‌త‌గా స్వీక‌రించాల‌న్నారు. నిజానికి, దేశంలో 75 జిల్లాలను లాక్ డౌన్ చేయాలంటూ కేంద్రం ప్రకటించింది. ఆ జాబితాలో తెలంగాణకు చెందిన ఐదు జిల్లాలు ఉన్నాయి. కానీ, ముందుజాగ్రత్త ద్రుష్ట్యా రాష్ట్రమంతా 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేద్దాం అన్న నాగబాబు, కౌంటర్ ఇచ్చిన నెటిజన్లు

భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు 1960వ దశకం నుండి ఉన్నాయి. అప్పుడప్పుడు హిందీ చీనీ భాయి భాయి అంటూ సత్సంబంధాలు నెరపడం, మళ్ళీ అప్పుడప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వడం దశాబ్దాలుగా జరుగుతోంది....

పరిహారం, పర్యావరణానికి ఎల్జీ పాలిమర్స్ కట్టిన రూ.50 కోట్లు ..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ...

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

HOT NEWS

[X] Close
[X] Close