ఇక షర్మిలకు అండగా తెలంగాణ పోలీస్ !

సునీత, షర్మిలపై సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. వైఎస్ సునీత రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై FIR నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. 509, 506 IPC తో పాటు 67 IT యాక్ట్ వంటి కఠినమైన సెక్షన్లను చేర్చారు. తమని , సోదరి షర్మిల ను చంపుతామని బెదిరిస్తున్నారని… ఆధారాలు సమర్పించారు సునీత. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సోషియల్ మీడియా పోస్టింగ్ లు పరిశీలించి కేసు నమోదు చేశారు. శత్రు శేషం ఉండకూడదు, ఇద్దరిని లేపేయ్ అన్నాయ్ .. ఎన్నికలకు పనికొస్తారు అని పోస్టింగ్ లు ఉండటం.. గతంలో జరిగిన చరిత్రను చూస్తే.. సీరియస ఇష్యూగానే పోలీసులు గుర్తించారు. దీంతో వర్రా రవీంద్రారెడ్డిని..నేడో .. రేపో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నట్లుగా విజయసాయిరెడ్డి మాట్లాడిన కొద్ది గంటల్లోనే తెలంగాణ పోలీసులు ఈ కేసు నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది., ఇన్ని రోజులు.. ఏపీ రాజకీయాల వైపు తెలంగాణ అధికారపక్షం చూడలేదు. షర్మిలకు రేవంత్ రెడ్డి ఎక్కడా బలమైన మద్దతు ఇస్తున్నట్లుగా కూడా కనిపించలేదు.కానీ ఇప్పుడు వైసీపీ నేతల వ్యవహారంతో… షర్మిలకు తెలంగాణ వైపు నుంచి గట్టి మద్దతు ఇవ్వాలన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో జగన్ రెడ్డికి.. తెలంగాణ పోలీసుల్ని యథేచ్చగా వాడుకునే అవకాశాన్ని కల్పించారు కేసీఆర్. అందుకే డేటా చోరీ అంటూ పనికి మాలిన కేసుల్ని పెట్టి టీడీపీ యాప్ ను నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలపై సోదాలు చేసి… టీడీపీ డేటా మొత్తం పోలీసుల సాయంతోనే చోరీ చేశారు. పైగా అంజనీకుమార్ వంటి ఐపీఎస్ అధికారులు మ్యాప్ లు ప్రదర్శించి ఇలా జరిగిందంటూ.. సొల్లు కథలు చెప్పి తప్పుడు ప్రచారాలు కూడా చేశారు. అదొక్కటే కాదు… చాలా ేసులు నమోదు చేశారు. అప్పట్లో ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ రెడ్డి బహిరంగంగానే చెప్పేవారు. తర్వాత ఆయన చేతిలోకి ఏపీ పోలీసులు వచ్చారు. వారిని ఆయన ఎలా వాడుకున్నారో అందరూ చూశారు. ఇప్పుడు రివర్స్ లో తెలంగాణ పోలీసులు షర్మిల, సునీతకు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ష 2: ఇంట్ర‌వెల్ లో ‘జాత‌రే..’

ఈ యేడాది విడుద‌ల అవుతున్న క్రేజీ ప్రాజెక్టుల‌లో 'పుష్ష 2' ఒక‌టి. ఆగ‌స్టు 15న 'పుష్ష 2'ని విడుద‌ల చేయ‌డం కోసం చిత్ర‌బృందం రేయింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో...

చిరు సినిమాలో ఆషికా రంగ‌నాథ్‌?

సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల్లో 'నా సామిరంగ‌' ఒక‌టి. నాగార్జున స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ మెరిసింది. త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ తో ఆక‌ట్టుకొంది. సీరియ‌ర్ హీరోల‌కు ఆషికా మంచి ఛాయిస్ అని.. అంతా అనుకొన్నారు....

రాజాసాబ్‌: సెకండాఫ్‌… స్పెల్‌బౌండ్!

'స‌లార్‌'తో మ‌రో సూప‌ర్ హిట్టు కొట్టాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు త‌న దృష్టంతా క‌'ల్కి', 'రాజాసాబ్‌'ల‌పై ఉంది. రెండింటికీ త‌న కాల్షీట్లు పంచుతున్నాడు. రాజాసాబ్ చిన్న చిన్న షెడ్యూల్స్‌తో మెల్ల‌గా పుంజుకొంటోంది. ఈ సినిమాకు...

వైసీపీలో అందరూ చర్చకు సిద్ధమే .. జగన్ రెడ్డి తప్ప !

వైసీపీలో అధినేత జగన్ రెడ్డి తప్ప.. తామంతా పోటుగాళ్లమేనని నిరూపించుకునేందుకు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతున్నారు. కానీ అసలు జగన్ రెడ్డి మాత్రం చర్చకు వస్తానని చెప్పడం లేదు. తాజాగా అంబటి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close