కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వ్యక్తిగతంగా మాట్లాడాలంటూ రాహుల్ గాంధీని స్పీకర్ కోరగా..ఆయన ఢిల్లీకి రావాలని స్పష్టం చేశారు. దీంతో గడ్డం ప్రసాద్ త్వరలోనే హస్తిన వెళ్లనున్నారు. అయితే, రాహుల్ గాంధీతో స్పీకర్ పర్సనల్ టాక్ ఏముంటుంది అన్న చర్చ కాంగ్రెస్ తోపాటు రాజకీయ వర్గాల్లోనూ ప్రారంభమైంది.
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదని క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్.. దానం, కడియంలపై నిర్ణయం పెండింగ్ లో ఉంచారు. త్వరలోనే వీరి విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ను స్పీకర్ కోరడంతో ఇదే అంశంపై చర్చించేందుకు సమయం కోరారా? లేదంటే, త్వరలోనే తనకు కేబినెట్ లో చోటు కల్పించాలని రిక్వెస్ట్ చేసేందుకు అపాయింట్ మెంట్ కోరారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదీ ఏమైనా, అనూహ్యంగా రాహుల్ ను స్పీకర్ అపాయింట్ మెంట్ కోరడం చర్చనీయంశంగా మారింది.
