తెలంగాణ ఉద్యోగులకు సగం జీతాలే..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ఆదాయం పెరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు… వైద్య సిబ్బందికిపూర్తి జీతాలను చెల్లిస్తారు. పెన్షనర్లకు 75శాతం చెల్లిస్తారు. దీంతో వరుసగా మూడో నెల కూడా.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే అందనుంది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ పోతోంది. నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించడానికి పర్మిషన్ ఇవ్వడంతో.. పన్నుల ఆదాయం పెరిగింది.

అదే సమయంలో… మద్యం దుకాణాలు కూడా ఓపెన్ చేశారు. తొలి రోజే.. 90 కోట్ల ఆదాయం వచ్చిందన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా అమ్మకాలు సాగుతున్నాయి. దీంతో… తమకు ఈ నెల అయినా పూర్తి జీతాలు ఇస్తారని… ఉద్యోగులు ఎదురు చూస్తూ వస్తున్నారు. మళ్లీ సాధారణ పరిస్థితులు రావడంతో..ఉద్యోగులు విధులకు కూడా హాజరవుతున్నారు.మే నెలలోనైనా పూర్తి జీతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పటివరకు కోత పెట్టిన జీతం సంగతి ఎలా ఉన్నా.. మే నెల జీతం పూర్తి జీతం వస్తుందని ఎదురు చూసిన ఉద్యోగులకు షాక్ ఇచ్చినట్లయింది.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. తగ్గించిన జీతాలు మళ్లీ ఇస్తారో లేదో క్లారిటీ లేదు.. కనీసం ఆదాయం పెరిగిన తర్వాత కూడా.. జీతాలు కత్తిరించి ఇస్తే ఎలా అన్న భావనలో ఉద్యోగులు ఉన్నారు. అయితే ఉద్యోగ సంఘాలు ఇప్పుడు అంత బలంగా లేవు. గతంలో ఉద్యోగ సంఘాల్లో ఉన్నవారు ఇప్పుడు పదవుల్లో ఉన్నారు . దాంతో వారికి వాయిస్ లేకుండా పోయింది. ఉద్యోగుల జీతాలు కత్తిరించినప్పుడు కూడా కేసీఆర్ ఎవరితోనూ మాట్లాడలేదు. అప్పుడు కూడా ఎవరూ నోరు మెదపలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close