ఓటుకునోటు కేసులో సంచలనం: ట్యాపింగ్ నిజమేనని నిర్ధారణ

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు కొత్త మలుపు తిరిగింది. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనమేరకు తాము కొన్ని ఫోన్లను ట్యాప్ చేసినట్లు టెలికామ్ కంపెనీలు ప్రకటించాయి. కాల్ డేటా విషయమై ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఎయిర్‌టెల్, ఐడియా, రిలయెన్స్ టెలికామ్ సంస్థలు, అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్లలో ట్యాపింగ్ చేసిన విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాయి. ఈ ఏడాది మే – జూన్ నెలల్లో తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌వారు తమకు కొన్ని ఫోన్ నంబర్లను ఇచ్చి ఆ నంబర్లను ఉపయోగించేవారి సంభాషణలను రికార్డ్ చేయవలసిందంటూ భారత టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5ను ఉదహరిస్తూ కోరారని టెలికామ్ సంస్థలు పిటిషన్‌లో తెలిపాయి. అయితే ఆ ట్యాపింగ్ ఇరు రాష్ట్రాలమధ్య రాజకీయ సంక్షోభం సృష్టించటంతో తాము ఇరుక్కుపోయామని సంస్థలు సుప్రీం కోర్టుకు వెల్లడించాయి.

రేవంత్ రెడ్డి స్టీఫెన్‌సన్‌ వద్దకు వెళ్ళటం తదితర పరిణామాలన్నీ మే 28-31మధ్య జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ మూడు టెలికామ్ సంస్థలనూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాల్ డేటా ఇవ్వాలని కోరటం, దానిని విజయవాడ కోర్టు సమర్థించటం, ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు బెదిరించటం సంగతి విదితమే. దీనిపైనే ఆ టెలికామ్ సంస్థలు సుప్రీం కోర్టుకు వెళ్ళాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాలు ఆరోగ్యం అత్యంత విష‌మం

అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం.. ఈరోజు మ‌రింత క్షీణించింది. ఆయ‌న ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని స‌మాచారం. కాసేప‌ట్లో వైద్యులు హైల్త్ బుటిటెన్ ని విడుద‌ల చేయ‌నున్నారు....

బుగ్గనకు నెలాఖరు కష్టాలు.. ఢిల్లీలో నిధుల వేట..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన రాష్ట్రానికి రావాల్సిన నిధుల జాబితా ఇచ్చి వెళ్లిన తర్వాతి రోజునే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో నిధులు...

“పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులు ఎత్తివేత” జీవో నిలుపుదల..!

తెలుగుదేశం పార్టీ హయాంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై కొంత మంది దాడి చేసి బీభత్సం సృష్టించారు. పోలీసులపై దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ కేసులను ప్రస్తుత ప్రభుత్వం ఎత్తివేస్తూ...

కొడాలి నాని సంయమనం కోల్పోయి ఉండవచ్చు : సజ్జల

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే.. పక్కాగా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది . అందులో డౌట్ లేదు. అందుకే కొడాలి నాని పనిగట్టుకుని అంటున్న మాటలు పై స్థాయి వారికి...

HOT NEWS

[X] Close
[X] Close