చెట్టు పేరు చెప్పి.. కాయలమ్మేసే సినిమాలు!

‘నేను కాయను నమ్మను. చెట్టును నమ్ముతాను.’ అంటూ ఓ సినిమాలో ఆహుతి ప్రసాద్‌ చెప్పే డైలాగు అప్పట్లో చాలా మందికే ఎక్కింది. నిజానికి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం అనే సామెత మనలో చాలా మందికి తెలుసు! ”మేము ఫలానా వారి వంశానికి చెందిన వారము గనుక.. మేము కూడా వారి అంతటి మహానుభావులమే…” అని స్ఫురింపజేయడానికి అన్నట్లుగా చాలా మంది తమ పేర్లలో కుల, మత, వంశ చిహ్నాలను తగిలించుకుని ఊరేగుతూ ఉండడం కూడా కద్దు. కనుక ఇలా చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవడం అనేది లోకరీతి. కాకపోతే.. మరో ట్విస్టు ఏంటంటే.. ఎక్కడో కాసిన ఏదో కాయను తీసుకువచ్చి.. జనసామాన్యంలో మాంఛి క్రేజ్‌ ఉన్న చెట్టుకు తగిలించేసి.. ఆ చెట్టుకు కాసినదే.. అని భ్రమింపజేసి విక్రయించాలనుకోవడమే చిత్రమైన సంగతి. పైగా ఇది ప్రస్తుతం మన చిత్ర సీమలో కూడా దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతోంది.

అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమాల్లో కూడా క్వాలిటీ ఉన్నవి- లేనివి అన్ని రకాలూ తయారవుతూ ఉంటాయి. సినిమా అనేది ప్రధానంగా మార్కెటింగ్‌ను బట్టి మాత్రమే సక్సెస్‌ చవిచూసే మీడియా. అందుచేతనే అందరూ మార్కెట్‌ కోసం ఎగబడుతూ ఉంటారు. చాలా మధ్యశ్రేణి సినిమాల విషయంలో ప్రఖ్యాత రచయితలు రాసినట్లుగా టైటిల్స్‌ పడతాయి.. కానీ వాళ్లు రాయరు.. వారికి కాస్త ‘బయానా’ ముట్టజెప్పి.. వారి పేరును మాత్రం స్క్రిప్టు రచయితల కింద వాడుకుంటారు. అలాగే ప్రఖ్యాత సంగీత దర్శకుల పేరు వాడుకుని.. వారికి ఒక్కో సినిమాకు 50 లక్షల వరకు చెల్లించి (కేవలం పేరు వాడుకున్నందుకు), చేతులు కాల్చుకున్న ప్రబుద్ధులు కూడా గతంలో ఉన్నారు. చాలా సందర్భాల్లో దర్శకత్వ పర్యవేక్షణ కేసులు కూడా అలాగే ఉంటాయి. ఏదో ఆ బ్రాండ్‌ మీద సినిమాను అమ్మేసుకోవాలనే తాపత్రయం తప్ప అందులో విషయం ఉండదు.

ఈ ట్రెండు ఇలా టెక్నీషియన్స్‌ను ‘చెట్టుపేరు’గా వాడుకోవడం దగ్గరినుంచి ఇటీవలి కాలంలో ఇతర రంగాలకు కూడా పాకింది. సినిమా పూర్తిచేసి ఫలానా ఏరియాకు ఫలానా డిస్ట్రిబ్యూటర్‌ కొనుక్కున్నాడు అంటూ ముమ్మరంగా ప్రచారం చేసుకోవడం.. ఆయన చాలా తెలివైన డిస్ట్రిబ్యూటర్‌ గనుక.. ఆయన కొన్నాడనే క్రేజ్‌ మీద.. మిగిలిన ఏరియాలు అమ్మేయడం, సదరు అసలు డిస్ట్రిబ్యూటర్‌కు మాత్రం.. ప్రకటించిన ధర కాకుండా.. ‘తమకు తోచింది ఇవ్వండి’ అంటూ బేరాలు ఆడుకోవడం కూడా ఇటీవలి కాలంలో ఒక సాంప్రదాయంలాగా కొనసాగుతూ వచ్చింది.

చిన్న సినిమాల విషయంలో మరో వ్యవహారం కూడా జరుగుతూ ఉంటుంది. చిన్న నిర్మాత ఎవరో ఉత్సాహం కొద్దీ ఒక చిత్రం చేస్తారు.అది పూర్తవుతుంది. కానీ రిలీజ్‌ వారికి సాధ్యం కాదు. ఒకవైపు పెట్టిన పెట్టుబడిపై వడ్డీలు, రుణాల భారం పెరుగుతుంటుంది. అలాంటి క్లిష్ట సమయంలో మరొక అనుభవజ్ఞుడైన నిర్మాత ఎవరికైనా సినిమాను టోకుగా అమ్మేస్తారు. అంటే పూర్తయిన సినిమాను నిర్మాత తన క్రెడిట్స్‌లేకుండా, మరో నిర్మాతకు అమ్మేస్తాడన్నమాట. ఆ నిర్మాత బ్రాండ్‌ మీద అది విడుదల అవుతుంది. ఇలాంటి పోకడలు ఇప్పుడు మళ్లీ ట్విస్టులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా పూర్తయ్యాక.. దీని విడుదల మనకు సాధ్యం కాదని అర్థం కాగానే.. ఓ పెద్ద చిత్రనిర్మాణ సంస్థను ఆశ్రయించి వారి చేతుల్లో పెట్టేయడం. సినిమా కొనుక్కోవడం లాంటి పై పద్ధతిలాగానే ఇది కనిపిస్తుంది. కానీ.. కొత్తగా పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ముదిరిపోయాయి. చిన్న చిత్రాలను కొనడం లేదు. కానీ తమ పేరు నిర్మాతలుగా వేసుకుంటూ.. లాభాల్లో వాటా మాత్రం తీసుకుంటున్నాయి. అంటే.. విడుదలకు నోచుకోని అవకతవక సినిమాలను తమ బ్రాండ్‌ మీద విడుదల చేస్తున్నందుకు గాను.. (కేవలం పేరు వాడుకున్నందుకు) ఆ సినిమా విడుదల తర్వాత వచ్చే సొమ్ముల్లో భారీ వాటాను తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇలా తమ బ్రాండ్‌ వేల్యూను బేరానికి పెడుతున్న నిర్మాతలు కూడా తయారవుతున్నారు.

కొన్ని చిన్న చిత్రాలు ఇలాగే.. పెద్ద నిర్మాణ సంస్థల సాలెగూటిలో చిక్కి విడుదలకు నోచుకోవడం, అంతో ఇంతో కలెక్షన్ల రూపంలో రాలిన సొమ్మును.. ఆ నిర్మాణ సంస్థకే ముట్టజెప్పుకుని.. చేతులు దులిపేసుకుని రావడం జరుగుతున్నదని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తుంటాయి. పెద్దసంస్థలకు అంత ఔదార్యం లేదా సినిమాపై నమ్మకం ఉంటే.. ఏకంగా చిన్న చిత్రాన్ని పూర్తయిన కొనేసుకోవడం ఒక ఎత్తు. నిర్మాతకు పైసా ఇవ్వకుండా, తమ బ్రాండ్‌ వేల్యూ మీద విడుదలచేసి.. కలెక్షన్లలో భారీ వాటా కాజేయడం అనే కొత్త పోకడ మాత్రం.. చిన్న నిర్మాతల్ని మరింత నాశనం చేసేలా మారుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కానీ ఇలాంటి అడ్డగోలు విధానాల్లో మార్పుతీసుకురావడంఅనేది ఒక పట్టాన సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే.. ఏ వ్యవహారామూ అధికారికంగా జరుగుతూ ఉండదు.. మరి దానికి నియంత్రణ ఎలా కుదురుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close