భారత్, పాకిస్తాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలతో పాకిస్తాన్ వైపు నుంచి భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. సరిహద్దుల నుంచి మోర్టార్లతో కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లికి చెందిన మురళీనాయక్ చదువుకునే రోజుల నుంచి ఎన్సీసీ వంటి వాటిలో చురుకుగా పాల్గొనేవాడు. తర్వాత ఆర్మీకి ఎంపికయ్యాడు. మంచి ప్రతిభ చూపడంతో కీలకమైన ఆపరేషన్లలో భాగం అయ్యాడు. అయితే దురదృష్టవత్తూ పాకిస్తాన్ రక్త దాహానికి వీరమరణం పొందాడు.
మురళీనాయక్ చనిపోయిన విషయం ఆయన కుటుంబసభ్యులకు తెలిపారు. శనివారం బెంగళూకురు ప్రత్యేక వైమానిక విమానంలో మృతదేహాన్ని తీసుకు వస్తారు. అక్కడి నుంచి అనంతపురంకు రోడ్డు మార్గాన తీసుకువచ్చి తుది వీడ్కోలు పలుకుతారు. సైనిక , అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. మురళీనాయక్ తల్లిదండ్రులు.. ఒక్కడే కుమారుడు… అయినా భయపడకుండా దేశ సేవకు పంపించారు. ఇప్పుడు వారు కుమారుడ్ని కోల్పోయారు. మురళీనాయక్ తల్లి గుండెలవిసేలా రోదిస్తున్నారు. అయితే మురళీనాయక్ తండ్రి మాత్రం ధైర్యంగానే ఉన్నారు. తన కుమారుడు దేశం కోసం ప్రాణాలర్పించాడని అంటున్నారు.
మురళీనాయక్ కుటుంబాన్ని చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. మంత్రి సవిత వారి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు . ప్రభుత్వం తక్షణ సాయంగా వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది. మురళీనాయక్ చిన్న వయసులోనే గొప్ప ప్రతిభ చూసి సరిహద్దుల్లో సాహసంగా విధులు నిర్వహించినా.. ఉగ్ర పాకిస్తాన్ కుట్రలుక బలి కావాల్సి వచ్చింది. తెలుగు ప్రజలంతా మురళీనాయక్ వీరమరణానికి సెల్యూట్ చేస్తున్నారు.