తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీని నియమించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగన సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ చేపట్టిన, చేపట్టదలిచిన ప్రాజెక్టులపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదని నిర్ణయించుకున్న ఏపీ ప్రభుత్వం.. ఒక్క బనకచర్లను మాత్రమే ప్రతిపాదించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల కాకుండా పదమూడు అంశాలను ప్రస్తావించింది.
ఈ వివాదాలన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాలకు చెందిన నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఫైనల్ గా నిర్ణయం తీసుకున్నారు. సోమవారంలోపు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో కృష్ణా బోర్డు ఏపీలో.. గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. నీటి విడుదల సమయంలో టెలిమెట్రీలు ఏర్పాటు చేసి ఎవరు ఎంత తీసుకున్నారన్నది లెక్కించాలని నిర్ణయించారు. సమావేశం ఆహ్లాదంగా సాగిందని.. ఇచ్చిపుచ్చుకునేలా సాగిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం సన్మానించుకున్నారు. సమావేశంలో పలు అంశాలపై వాదోపవాదాలకు అవకాశం లేకుండా చర్చలు జరిగాయి. అవసరం అయితే అపెక్స్ కమిటీని కూడా సమావేశం పరిచి.. కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. బనకచర్లపై అసలు ఎలాంటి చర్చ జరగలేదు.