బీజేపీపై వార్ : తెలుగు పార్టీలది గోడ మీద పిల్లి వాటమే..!

దేశంలో బీజేపీని వ్యతిరేకించి పార్టీలతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో మోడీని దించడమే లక్ష్యంగా కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి 19 పార్టీలు హాజరయ్యాయి. రాజకీయ కారణాలతో ఆమ్‌ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ ఆహ్వానించలేదు. యూపీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఎస్పీ, బీఎస్పీ రావడానికి ఇష్టపడలేదు. అయితే ఈ మూడు పార్టీలూ బీజేపీకి వ్యతిరేకమే. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక్కపార్టీ కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరేందుకు ధైర్యం చూపలేకపోయింది. నిజానికి ఏ పార్టీ కూడా తము బీజేపీతో అంటకాగుతున్నాం అని ఒప్పుకోవడం లేదు.. అలాగని పోరాడుతున్నామని కూడా చెప్పలేకపోతున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌ భారతీయ జనతా పార్టీని శత్రువుగా చూస్తోంది. ఒకప్పుడు ఆ పార్టీపై యుద్ధమే అన్న టీఆర్ఎస్ అధినేత ఇప్పుడు సైలెంటయిపోయారు. ఢిల్లీ స్థాయిలో సహకారం.. రాష్ట్ర స్థాయిలో పోరాటం అన్నట్లుగా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి లేకుండా కపిల్ సిబల్ నిర్వహించిన విపక్ష పార్టీల భేటీకి టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కానీ సోనియా నిర్వహించిన భేటికి మాత్రం దూరంగా ఉన్నారు. అంటే ప్రత్యేక ఎజెండా అమలు చేస్తున్నారని అనుకోవాలి. టీఆర్ఎస్‌ బీజేపీకి ఎదురెళ్లే ధైర్యం చేయడం లేదని తాజా సమావేశంతో తేలిపోయింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు మోడీ అంటేనే భయపడుతున్నాయి. ఎందుకొచ్చిన గోల అని సైలెంట్‌గా ఉంటున్నాయి. ఢిల్లీలో బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం రెండు పార్టీలు పోటాపోటీప్రదర్శనలు చేస్తున్నాయి. విపక్షాల భేటీలకు వెళ్లవు. పార్లమెంట్‌లో ఏమైనా బిల్లులు వివాదాస్పదమైతే ప్రభుత్వానికే అండగా ఉంటున్నాయి. వ్యతిరేకిస్తే దుర్భర పరస్థితులు ఎదురువుతాయని ఆయా పార్టీల అధినేత భయం కావొచ్చు. ఈ కారణంగా బీజేపీతో మనకెందుకులే అనుకుంటున్నారు. భయంతో రాజకీయాలు ఎంత కాలం చేస్తారో కానీ.., ఢిల్లీ రాజకీయాల్లో తెలుగు పార్టీలను పట్టించుకోవడం కూడా మానేసే పరిస్థితి వచ్చింది.

అధికారంలో ఉన్న వారు వేధింపులకు పాల్పడతారని వారిపై పోరాడటం ఆపేస్తే. ప్రజలు కూడా నమ్మడం మానేస్తారు. తెగించి పోరాడిన వారికే ప్రజల మద్దతు లభిస్తుంది. ఒక్కోసారి ఎదురు దెబ్బలు తగలవచ్చు కానీ.. వెనక్కి తగ్గితే ఇబ్బందే. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు డబుల్ గేమ్ ఆడకుండా నేరుగా బీజేపీకి దగ్గరో.. దూరమో తేల్చుకుంటే… దేశ రాజకీయంలోనూ ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసులకిచ్చిన “ఆఫర్” కూడా జగన్‌ మార్క్‌దే !

సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన సీఎం జగ‌న్ అని దేశవ్యాప్తంగా గొప్పగా ప్రకటించారు. డీజీపీ గౌతం సవాంగ్ కూడా.. జగన్...

సజ్జల పరిశీలించారు.. ఇప్పుడు సీఎం వంతు !

సొంతజిల్లాను వరదలు అతలాకుతలం చేసినా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించారు. రెండు, మూడు తేదీల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరులోనూ క్షేత్ర స్థాయిలో పర్యటించి...

కేసీఆర్ అగ్రెసివ్ పాలిటిక్స్ వెనుక ప్రశాంత్ కిషోర్ !?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రూటు మార్చారు. దారుణమైన తిట్లతో వివాదాస్పద రాజకీయం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు కానీ.. ఆయనకు ప్రశాంత్ కిషోర్ అందించడం ప్రారంభమైందని...

ఏపీ పేదల్లో “ఓటీఎస్” అలజడి ! ప్రభుత్వానికి దయ లేదా ?

ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఎక్కడకిక్కడ నిధులు సమీకరిస్తోంది. అప్పులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా దేన్నీ వదిలి పెట్టడం లేదు. అయితే ఇప్పుడు ప్రజల్నీ బాదేయడం అనూహ్యంగా మారింది. నిరుపేదల్ని రూ....

HOT NEWS

[X] Close
[X] Close