యాంకర్లా…! పార్టీ కార్యకర్తలా..!?

తెలుగు చానెళ్ల పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంభట్లు అన్నచందంగా తయారవుతోంది. ఏ చానెల్ నిజం చెబుతోందో…, ఏ చానెల్ అవాస్తవాలను ప్రచారం చేస్తోందో.. ఎవరి వాదన నిజమో… ఎవరి ప్రతిఘటన వాస్తవమో తెలుసుకునే పరిస్థితులు లేకుండా పోయాయని తెలుగు వీక్షకులు వాపోతున్నారు. చానెళ్లు ఒక్కో పార్టీకి దాసోహం అయిపోవడం, ప్రభుత్వాలు కూడా కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించడంతో చానెళ్ల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందనే విమర్శలు వస్తున్నాయి. సరే, చానెళ్ల యజమానులు ఆయా పార్టీలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు.

అయితే అందులో పని చేసే సీనియర్ జర్నలిస్టులు కూడా వారి వ్రత్తిధర్మాన్ని పక్కన పెట్టి మరీ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రాలు ప్రముఖ చానెళ్లలో వచ్చే చర్చాగోష్టిల్లో ఆయా చానెళ్ల యాంకర్లు ప్రవర్తిస్తున్న తీరు వీక్షకులకు రోత పుట్టిస్తోందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార చానెల్ లో ప్రతి రోజు ఉదయం నిర్వహించే చర్చా కార్యక్రమ
నిర్వాహకుడు, దాని యాంకర్ చాలా సీనియర్ జర్నలిస్టు. మంచి రిపోర్టర్ గా, మంచి రాతగాడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్నతాధికారులతో చాలా పరిచయాలున్నాయి. అలాంటి సీనియర్ జర్నలిస్టు తాను యాంకర్ గా వ్యవహరిస్తున్న చర్చాగోష్టిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎవరైనా విమర్శలు చేస్తే తట్టుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. చర్చాగోష్టిలో ఆ యాంకర్ ఊగిపోతూ, కళ్లెర్ర చేస్తూ అధికార పార్టీకి మద్దతుగా… కాదు కాదు… ఏకంగా ఆ పార్టీ నాయకుడిగా మాట్లాడడం చూసిన వీక్షకులు “వీళ్లేం జర్నలిస్టులు” అనే పరిస్థితి వచ్చింది. ఈ చర్చాగోష్టికి ముగిసిన తర్వాత మరో చానెల్ లో ప్రారంభమయ్యే అధికార పార్టీ వ్యతిరేక చర్చలో కూడా ఇదే సీన్ రిపీట్. కాకపోతే ఇక్కడ యాంకర్ స్ధానంలో ఉన్న జర్నలిస్టు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతారు. చర్చలో ఇద్దరి మధ్య వారధిలా, వార వాదనకు సవివరంగా చెప్పాల్సిన యాంకర్ల తామే చర్చలో నేరుగా పాల్గొన్న నాయకుల్లా వ్యవహరించడం తెలుగు చానెళ్లకు మాత్రమే దక్కిన గౌరవంగా వీక్షకులు భావిస్తున్నారు. ఇక రేటింగుల్లో అందరి కంటే పైన ఉన్న, మంచి సమాజం కోసం అని చెబుతున్న చానెల్ యాంకర్లు అయితే తాము అధికార పార్టీ కార్యకర్తలమే అని ప్రతి చర్చలోనూ నిరూపించుకుంటున్నారని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రతి చానెల్ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారడంతో తెలుగు ప్రజలకు వాస్తవాలు మాత్రం తెలియడం లేదు. చానెళ్ల యాంకర్లు రోజురోజుకు ప్రవర్తిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది.    

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close