అమెరికాలో మరో తెలుగు విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఎల్బీ నగర్‌కు చెందిన 28 ఏళ్ల విద్యార్థి పోలే చంద్రశేఖర్ అమెరికాలో దుండగుల కాల్పుల్లో మరణించాడు. నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో చదువుతూ, డెంటన్లోని ఒక పెట్రోల్ బంక్‌లో నైట్ షిఫ్ట్‌లో పని చేస్తున్నాడు. దోచుకునేందుకు వచ్చిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. సంఘటనా స్థలంలోనే చంద్రశేఖర్ చనిపోయాడు.
చంద్రశేఖర్ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. అతను ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత అమెరికాకు వెళ్లి, మాస్టర్స్ చదువుతున్నాడు. ఖర్చుల కోసం పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. డెంటన్లోని ఒక గ్యాస్ స్టేషన్లో నైట్ షిఫ్ట్ పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ముస్క్లు పెట్టుకున్న దుండగులు బంక్‌లోకి ప్రవేశించి డబ్బుల కోసం బెదిరించారు. చంద్రశేఖర్ వాళ్లకు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగానే కాల్పులు జరిపారు.
డెంటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసును ‘రాబరీ, మర్డర్’గా నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. పెట్రోల్ బంక్‌లోని CCTV ఫుటేజ్‌లు దుండగుల ముఖాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆఫ్రో-అమెరికన్ వ్యక్తులుగా గుర్తించారు. భారత కాన్సులేట్ ఈ విషయాన్ని తెలుసుకుని, కుటుంబానికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది.