హైదరాబాద్‌లోని చారిత్రక ‘తెలుగు తల్లి ఫ్లైఓవర్’కు కొత్త పేరు వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ బుధవారం తెలుగు తల్లి ఫ్లైఓవర్నుదీనిని ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా పేరు మార్చాలని ఆమోదించింది. త్వరలో కొత్త సైన్‌బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదన టేబుల్ ఏజెండాగా ప్రవేశపెట్టారు. 15 మంది సభ్యుల ఏకగ్రీవంతో ఆమోదించారు. ఈ కమిటీలో 7 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు, 8 మంది AIMIM కార్పొరేటర్లు ఉన్నారు. ఈ ఫ్లైఓవర్ లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి సెక్రటేరియట్ వరకు అనుసంధానమై ఉంది.
ఈ ఫ్లైఓవర్‌కు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 1995లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్యాట్ని, బేగంపేట, ప్యారడైజ్, మెహదీపట్నం, తెలుగు తల్లి ఫ్లైఓవర్ల ప్రాజెక్టులను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌కు ప్రభుత్వం ఆ పేరు అధికారికంగా పెట్టలేదు. ఫ్లైఓవర్లు వద్ద తెలుగు తల్లి విగ్రహం ఉండటంతో ఆ పేరు ప్రచారంలోకి వచ్చేసింది. దాన్నే అధికారికంగా కొనసాగించారు. ఆ విగ్రహాన్ని కేసీఆర్ సర్కార్ సెక్రటేరియట్ ప్రారంభంలో తొలగించారు.
తెలుగు అంటే ఆంధ్రా అనే భావన తీసుకు వచ్చి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ అంటే.. తెలుగు మాట్లాడే ప్రాంతమని పేరు. అలాంటి చోట్ల తెలుగుతల్లి విగ్రహం అంటే అదేదో ఆంధ్రా అన్నట్లుగా భావన తీసుకువచ్చి..తెలంగాణ తల్లి విగ్రహం పేరు పెడుతున్నారు. ప్రభుత్వం ఎన్నో ఫ్లైఓవర్లను నిర్మిస్తోంది. ఫ్యూచర్ సిటీని కడుతోంది. పెట్టాలనుకుంటే.. వాటికి పెట్టుకోవచ్చు. తెలుగుతల్లి విగ్రహం పేరును తీసేయాల్సిన పేరు లేదు. కానీ ఇదో రాజకీయం. ప్రజల్ని కించపరిచే రాజకీయం.
పేరు అధికారికంగా మార్చి అధికార ఉత్తర్వుల్లో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ల్ అని ప్రస్తావించినా.. ప్రజలు.. చెప్పుకోవడానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనే పిలుస్తారు. ఎందుకంటే అధికారికంగా ఆ ఫ్లైఓవర్ కు ఆ పేరు పెట్టుకుంది ప్రజలే. ప్రభుత్వాలు తీసేయలేవు.