‘విక్ర‌మ్‌’తో జాక్ పాట్ కొట్టిన నితిన్‌

క‌మ‌ల్‌హాస‌న్ `విక్ర‌మ్‌` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమాని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సంస్థ విడుద‌ల చేస్తోంది. క‌మ‌ల్ హాస‌న్‌, ఫ‌హ‌ద్ ఫాజిల్‌, విజ‌య్‌సేతుప‌తి.. ఇలా హేమా హేమీలు క‌లిసి న‌టించిన సినిమా ఇది. `ఖైది`లాంటి సూప‌ర్ హిట్ తీసిన‌. లోకేష్ క‌న‌గరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాబ‌ట్టి.. అంచ‌నాలు భారీగాఉన్నాయి. తెలుగు ప్రేక్ష‌కులు సైతం.. ఈ సినిమాపై ఓ లుక్ వేసే అవ‌కాశం ఉంది. జూన్ 3న‌.. తెలుగులో పెద్ద‌గా సినిమాలేం రావ‌డం లేదు. కాబ‌ట్టి.. విక్ర‌మ్ కి టికెట్లు తెగే ఛాన్స్ ఉంది. ట్రైల‌ర్ కూడా బాగుండంతో… ఆస‌క్తి ఇంకాస్త పెరిగింది.

ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ రూ.6 కోట్ల‌కు కొనుగోలు చేసింది. క‌మ‌ల్ హాస‌న్ సినిమాకి రూ.6 కోట్లంటే చీప్ గా కొట్టేసిన‌ట్టే. అయితే నితిన్ ప్ర‌మోష‌న్ల‌పై దృష్టి పెడుతున్నాడు. ప్ర‌మోష‌న్ల‌కు మ‌రో రూ.4 కోట్లు ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేద‌న్న‌ది త‌న ఉద్దేశం. సినిమాకి ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వ‌చ్చినా.. భారీ లాభాల్ని మూట‌గ‌ట్టుకోవ‌డం ఖాయం. యావ‌రేజ్‌గా న‌డిచినా.. త‌న పెట్టుబ‌డికి ఢోకా లేన‌ట్టే. ఇటీవ‌ల విడుద‌లైన వ‌రుణ్ డాక్ట‌ర్‌, డాన్ లాంటి సినిమాలు ఎలాంటి ప‌బ్లిసిటీ లేక‌పోయినా, మౌత్ టాక్ తో మంచి వ‌సూళ్లు ద‌క్కించుకొన్నాయి. వ‌రుణ్ డాక్ట‌ర్ అయితే.. నిర్మాత‌ల‌కు రెండు రెట్లు లాభాల్ని తెచ్చిపెట్టింది. విక్ర‌మ్ ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ లో కొత్త జోక్‌: మంచు వారి ‘100 కోట్ల‌’ సినిమా

మంచు మోహ‌న్ బాబు, విష్ణు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మాట‌ల్లో కాస్త అతిశ‌యోక్తులు క‌నిపిస్తుంటాయి. దాంతో అన‌వ‌స‌రంగా ట్రోల్ అవుతుంటారు. వీళ్లెప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా.. మీమ్స్ కి కంటెంట్ ఇచ్చి వెళ్తుంటారు. తాజాగా...

రాజ‌మౌళి మైండ్‌లో ‘ఈగ 2

రాజ‌మౌళి ఎప్పుడూ సీక్వెల్స్‌పై దృష్టి పెట్ట‌లేదు. కానీ ఈమ‌ధ్య త‌న దృష్టి అటు వైపే వెళ్తోంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌కి రెండో భాగం ఉందంటూ ఆమ‌ధ్య ఓ హింట్ ఇచ్చాడు. అయితే దానికంటే ముందు ...

ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ సజ్జల భార్గవ !

సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎవరు .. ఎలాంటి జనబలం లేకపోయినా ప్రభుత్వాన్ని అలవోకగా నడుపుతున్న వ్యక్తి. వ్యవస్థలన్నింటినీ ఎలా వాడేసుకోవాలో పీహెచ్‌డీ చేసిన ఘనుడు. అలాంటి వ్యక్తి కుమారుడు ఎలా ఉండాలి ?...

మీడియా వాచ్ : నెంబర్ 1 పేరుతో పరువు తీసుకుంటున్న చానళ్లు !

గత వారం తాము నెంబర్ వన్ అయ్యామంటూ.. టీవీ9 బృందం .. స్క్రీన్ మీదకు వచ్చి చేసిన హడావుడి తర్వాత.. చాలా మందికి వచ్చిన సందేహం ఒక్కటే.. అదేమిటటి.. టీవీ9 ఇప్పటి వరకూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close