నిట్-శ్రీనగర్ లో గొడవలకు కారణం వేర్పాటువాదమా, నిర్లక్ష్యమా?

‘ఏ స్టిచ్ ఇన్-టైం..సేవ్స్ టెన్’ అనే ఇంగ్లీష్ సామెత శ్రీనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కి అక్షరాల సరిపోతుంది. దేశం నలుమూలల నుంచి విద్యార్ధులు అక్కడ చదువుకొనేందుకు వెళ్తుంటారు. ఇన్నేళ్ళలో ఏనాడూ కూడా వారికి స్థానిక విద్యార్ధులతో ఎటువంటి సమస్యలు ఎదురవలేదు. అందరూ కలిసిమెలిసి చదువుకొనేవారు. కానీ మొట్టమొదటిసారిగా వారి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దానికి కారణం కొందరు స్థానికేతర విద్యార్ధులు క్యాంపస్ లో మువ్వన్నెల జెండా ఎగురవేయడమేనని తెలుస్తోంది. ఇటీవల కోల్ కతలో జరిగిన భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయం సాధించినప్పుడు ఆనందంతో కొందరు విద్యార్ధులు క్యాంపస్ లో మువ్వన్నెల జెండా ఎగురవేశారు. వారిని కొందరు స్థానిక విద్యార్ధులు అడ్డుకొనే ప్రయత్నం చేసారు. ఆ సందర్భంగా వారి మధ్య జరిగిన ఘర్షణ చిలికిచిలికి గాలివానలా మారింది. వేర్పాటువాదులకు, పాకిస్తాన్ కి అనుకూలంగా ఉండేవాళ్ళు చాలా అధికంగా ఉండే శ్రీనగర్ లో ఇటువంటి సమస్య రానే రాకూడదు. వస్తే దానిని వెంటనే పరిష్కరించి ఉండాలి. కానీ దానిని అందరూ ఉపేక్షించడంతో గోటితో పోయే సమస్య గొడ్డలి వరకు వచ్చింది.

నిట్ లో చదువుకొంటున్న స్థానికేతర విద్యార్ధులు తక్షణమే క్యాంపస్ విడిచిపెట్టి వెళ్లిపోకపోతే, సి.ఆర్.పి.ఎఫ్. బలగాలు వెళ్ళిపోగానే విద్యార్ధులను చంపివేస్తామని, మహిళా విద్యార్దులను రేప్ చేస్తామంటూ బెదిరింపు మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి. అవి శ్రీనగర్ లో తిష్ట వేసుకొని కూర్చొన్న భారత్ వ్యతిరేక శక్తుల నుంచేనని వేరేగా చెప్పనవసరం లేదు.

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల నుంచి సుమారు 120 మంది విద్యార్ధులు ప్రస్తుతం నిట్ లో చదువుకొంటున్నారు. వారిలో కొందరు ఈ బెదిరింపులకి భయపడి కొన్ని రోజులు శలవు పెట్టి తమ స్వస్థలాలకు వెళ్ళిపోతున్నారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులు ఈ రెండు మూడు నెలలు క్యాంపస్ లోపలే ఉంటూ విద్యాబ్యాసం పూర్తి చేసి వెళ్ళిపోవాలనుకొంటున్నారు. ఈ సమస్య కేవలం తెలుగు విద్యార్ధులే కాదు మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకొంటున్న వారు కూడా ఎదుర్కొంటున్నారు. అందుకే నిట్ క్యాంపస్ ని సురక్షితమయిన జమ్మూకి తరలించామని కోరుతున్నారు.

కానీ అది చాలా కష్టం కనుక నిట్ ని భద్రతాదళాల రక్షణలో ఉంచి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకొన్నాయి. ఈ సమస్యకు మూలం భారత వ్యతిరేకత తప్ప స్థానిక సమస్య కాదని అర్ధమవుతోనే ఉంది. శ్రీనగర్ లో భారత వ్యతిరేక శక్తులు బహిరంగంగానే పాక్ జెండాలు పట్టుకొని సభలు, ర్యాలీలు నిర్వహిస్తుండటం తరచూ చూస్తూనే ఉంటాము. ఇప్పుడు ఆ శక్తులు అత్యున్నత ప్రమాణాలతో నిర్వహింపబడే నిట్ లోకి కూడా తమ భావజాలాన్ని వ్యాపింపజేసినట్లు అర్ధమవుతోంది. ఈ సమస్యను గుర్తించిన వెంటనే నిట్ యాజమాన్యం తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకొని ఉండి ఉంటే నేడు పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు.

ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పిడిపి-భాజపా సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కానీ ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, డిల్లీ జె.ఎన్.యు.లలో చేతులు కాల్చుకొన్న భాజపా నిట్ లో చేతులు పెట్టేందుకు సాహసించకపోవచ్చును. పిడిపి వేర్పాటువాదులకు బహిరంగంగానే మద్దతునిస్తుంటుంది కనుక అది కూడా ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవచ్చును. మరి ఈ సమస్య ఎవరు పరిష్కరిస్తారో..ఎప్పటికయినా పరిష్కారం అవుతుందో లేక ఇదే మరో పెద్ద సమస్యగా మారుతుందో తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close