దేశం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఉగ్రదాడులు అనే పదానికి చాలా కాలంగా దూరంగా ఉంటున్న దేశం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఒక్క సారిగా జరిగిన భారీ పేలుడుతో ఉలిక్కి పడింది. చాలా మంది అది పేలుడు కాదని ఏదో ప్రమాదం అనుకుంటున్నారు.కానీ పేలుడు తీవ్రత చూసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా భారీ పేలుడు పదార్థలతో చేసిన కుట్రగా అర్థమైపోతుందని నిపుణులు అంటున్నారు.
పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించింది. టెర్రరిస్టులు పేలుళ్లకు వాడే మొదటి టెక్నిక్ ..పార్కింగ్ చేసిన వాహనాల్లో బాంబులు పెట్టడం. ఏదైనా ప్రమాదం వల్ల అయితే అంత తీవ్రత ఉండదు. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ధాటికి.. పేలుడు పదార్థాలు ఉన్న కారు సహా.. ఇరవై కార్ల వరకూ ధ్వంసం అయ్యాయి. దాదాపుగా ఎనిమిది మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పేలుడు పదార్థాలు అయితే తప్ప అంత భారీ పేలుడు సంభవించే అవకాశం లేదు.
కచ్చితంగా ఉగ్రదాడేనని అన్ని రకాల సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ.. మొత్తం క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ లో బాంబుదాడులకు కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు కొంత కాలంగా ఉన్నాయి. ఉద్దేశంతో ఎక్కడిక్కకడ అనుమానితుల్ని అరెస్టు చేస్తూ వస్తున్నారు. అయినా సరే వారు బాంబులు పేల్చడంలో సక్సెస్ అయ్యారు.
ఢిల్లీపేలుళ్ల తర్వాత ప్రధాన నగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో నిఘా పెట్టి .. ఉగ్ర కుట్రలు ఇంకా ఎక్కడైనా ప్లాన్ చేశారా అన్నదానిపై ఆరా తీస్తున్నారు. పూర్తిగా బలగాలన్నీ అలర్ట్ అయ్యాయి.

