రూమ‌ర్లంటూ కొట్టి ప‌డేసిన టీజీ.విశ్వ‌ప్ర‌సాద్‌

ఈమ‌ధ్య పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీపై వ‌చ్చిన‌న్ని వార్తా క‌థ‌నాలు మ‌రే సంస్థ‌పైనా రాలేదు. చేతిలో ప‌ది ప‌దిహేను సినిమాలున్నాయి. వంద‌ల మంది ఉద్యోగులు ఈ సంస్థ‌లో ప‌ని చేస్తున్నారు. దాదాపు ఇండ‌స్ట్రీలోని అంద‌రు హీరోల‌తోనూ, దర్శ‌కుల‌తోనూ డీలింగ్స్ ఉన్నాయి. అందుకే.. ఇలాంటి వార్త‌లు రావ‌డం కూడా కామనే. ముఖ్యంగా ఈ సంస్థ‌కు కుడిభుజంలా మారిన వివేక్ కూచిభొట్ల బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ని, వేరే ద‌ర్శ‌కుడితో ప్రొడ‌క్ష‌న్ ప్లానింగ్ చూసుకొంటున్నార‌ని వార్త‌లొచ్చాయి. వీటిపై పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ అధినేత టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ ఒక్క మాట‌లో క్లారిటీ ఇచ్చేశారు. ‘ఇవ‌న్నీ రూమ‌ర్సే’ అంటూ తేల్చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ‌లో ప్ర‌క్షాళ‌న జ‌రుగుతోంది క‌దా, అని అడిగితే ‘ప్ర‌తి సంస్థ కొన్ని నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ప‌ని చేస్తుంద‌ని, ఉద్యోగులు వ‌స్తుంటారు, వెళ్తుంటార‌’ని డిప్ల‌మెటిక్ ఆన్స‌ర్ చెప్పారు. వివేక్ కూచిభొట్ల త‌మ‌తోనే ఉన్నార‌ని డిక్లేర్ చేశారు. త్రివిక్ర‌మ్ తో పీపుల్ మీడియా ఓ సినిమా చేస్తోంద‌ని ఈమ‌ధ్య వార్త‌లొచ్చాయి. దానిపై కూడా ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా చేయాల‌ని ఎప్పుడో అనుకొన్నామ‌ని, అది వ‌ర్క‌వుట్ కాలేద‌ని, అది పూర్తిగా పాత విష‌య‌మ‌ని తేల్చేశారు.

ఈ సంస్థ నుంచి వ‌స్తున్న ‘ఈగిల్‌’ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈనెల 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నిజానికి సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. థియేట‌ర్ల స‌మ‌స్య‌ని త‌గ్గించ‌డానికి ఈ సినిమా స్వ‌చ్ఛందంగా బ‌రి నుంచి త‌ప్పుకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామ రాజీనామా – జగన్ అహన్ని నాలుగేళ్లు కసితీరా కొట్టిన ఎంపీ

వైసీపీకి ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. తనపై అనర్హతావేటు వేయించేందుకు జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని రాజీనామా లేఖలో వెటకారం చేశారు. మీడియాలో జగన్ రెడ్డిని ఎంత కామెడీ...

పోలీసుల సమస్యలు పరిష్కరించాలని జగన్ రెడ్డికి డీజీపీ లేఖ !

అదేంటో ... ఐదేళ్ల వరకూ తమ పోలీసు సిబ్బందికి సమస్యలు ఉన్నాయని.. వారి టీఏ, డీఏలు కత్తిరించినప్పుడు కూడా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి గుర్తు రాలేదు., ఇప్పుడు ఎన్నికలకు ముందు.. .మరో పది...

నిందితుల కోసం వచ్చిన తెలంగాణ పోలీసులపై కడపలో దాడి

వేరే రాష్ట్రాలకు వెళ్లి దొంగతనాలు చేసి వచ్చి తమ గ్రామంలో సేఫ్ గా ఉండటం బీహార్ లాంటి రాష్ట్రాల్లో దొంగలు చేస్తూంటారు. అన్నీ తెలుసుకుని ఎవరైనా పట్టుకోవడానికి వెళ్తే... వారిపై మూకుమ్మడి దాడి...

రాజోలు జనసేన అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు కుమార్తె !?

పొత్తుల్లో భాగంగా రాజోలు నియోజకవర్గం జనసేనకు కేటాయించారని పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. దీంతో అక్కడ జనసేన అభ్యర్థిత్వం కోసం పలువురు పోటీ పడుతున్నారు. మొత్తంగా రేసులో నలుగురు ఉన్నారు. నిజానికి సిట్టింగ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close