పవన్ కళ్యాణ్ అభిమానులు కళ్లలో కాయలు కాచేలా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ’. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకే తగ్గట్టే సినిమా రెడీ అవుతోంది. ఇప్పుడు మ్యూజిక్ డిపార్ట్మెంట్ విషయంలో తమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
అంతర్జాతీయ స్థాయి మ్యూజిక్‌ను అందిస్తున్నారు. లండన్‌లోని స్టూడియోలో 117 మంది సంగీత కళాకారులతో బీజీఎం రికార్డింగ్ జరగడం విశేషం. ఇందులో జపాన్ సాంప్రదాయ వాయిద్యం కోటో సహా అనేక వినూత్న వాయిద్యాలను ఉపయోగించారు. ముఖ్యంగా స్ట్రింగ్ వర్క్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తమన్, పెద్ద మొత్తంలో ఆర్కెస్ట్రా మ్యూజిక్‌తో థియేటర్లో కొత్త అనుభూతి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
ఆడియన్స్ బీజీఎంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. థియేటర్లో హై రావాలంటే రీ-రికార్డింగ్ చాలా ముఖ్యం. ‘ఓజీ’ కోసం తమన్, పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రకు తగినట్టుగా ఇంటెన్స్ బీజీఎం, హై వోల్టేజ్ థీమ్‌లు కంపోజ్ చేశారు. ఇప్పటికే హంగ్రీ చీతా థీమ్ వైరల్ అయ్యింది. ఓజాస్ గంభీర ట్రాక్ కూడా ఎక్కేసింది.
యాక్షన్ సీక్వెన్స్‌లలో స్ట్రింగ్ సెక్షన్స్‌ని నెక్స్ట్ లెవల్లో ఇవ్వాలని డిసైడ్ అయిన తమన్, మంచి స్ట్రింగ్ ప్లేయర్లు ఉండే లండన్‌కి మ్యూజిక్ వర్క్‌ని షిఫ్ట్ చేశారు. సినిమాకి ఎపిక్ టోన్ తీసుకురాగల శక్తి బీజీఎంకి ఉంది. ముఖ్యంగా స్ట్రింగ్ సక్సెస్ సరిగ్గా కుదిరితే ఫీల్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ‘ఓజీ’తో అలాంటి ఫీల్‌ని క్రియేట్ చేయడానికి తనవంతు డ్యూటీ చేస్తున్నాడు తమన్.