‘రాధే శ్యామ్’ కోసం తమన్

విడుదలకు సిద్దమౌతున్న టాప్ పాన్ ఇండియా సినిమాల్లో ప్రభాస్ రాధే శ్యామ్ కూడా ఒకటి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. పోస్ట్ ప్రొడక్షన్ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఇప్పుడీ సినిమాలో తమన్ చేరాడు. రాధే శ్యామ్ కి దాదాపు ఐదుగురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు. తెలుగు వెర్షన్ పాటలని జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేస్తున్నారు. హిందీ వెర్షన్ కి వస్తే.. మిథున్, ఆమాల్ మాలిక్, అర్జిత్ సింగ్, మాన్ భరద్వాజ్. అయితే ఇప్పుడు ఈ సినిమాలో తమన్ కూడా చేరాడు. ఈ సినిమాకి నేపధ్య సంగీతం అందిస్తున్నాడు తమన్. దాదాపు అన్నీ వెర్షన్లకు తమన్ నేపధ్య సంగీతం చేయనున్నాడు.

ప్రస్తుతం తమన్ ఫుల్ జోష్ లో వున్నాడు. ఆయన నుంచి వస్తున్న పాటలు చార్ట్ బస్టర్ గా నిలుస్తున్నాయి. దాదాపు పాటలన్నీ ట్రెండ్ సెట్టర్లుగా మారుమ్రోగుతున్నాయి. ఇక నేపధ్య సంగీతంలో అయితే సరికొత్త సౌండింగ్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం థియేటర్ లో సందడి చేస్తున్న అఖండ సినిమాలో నేపధ్య సంగీతం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. థియేటర్ లో ఎలివేషన్లు పేలాయి అంటే దానికి ముఖ్య కారణం తమన్ సమకూర్చిన నేపధ్య సంగీతం.

ఇక విడుదలకు సిద్దమౌతున్న బీమ్లా నాయక్ ఆడియో కూడా అదరగొట్టేశాడు తమన్. ఇప్పుడు సూపర్ ఫామ్ లో వున్న తమన్ ని రాధే శ్యామ్ నిర్మాతలు నేపధ్య సంగీతం కోసం సంప్రదించడం, ఓకే చేయడం జరిగింది. త్వరలోనే రాధే శ్యామ్ వర్క్ స్టార్ట్ చేయనున్నాడు తమన్. దాదాపు బడా హీరోలందరితోనూ వర్క్ చేశాడు తమన్. ప్రభాస్ తో మాత్రం ఇప్పటివరకూ ఇంకా కుదరలేదు. ఇప్పుడు రాధే శ్యామ్ ఆ ఛాన్స్ వచ్చింది. రాధే శ్యామ్ నేపధ్య సంగీతంకు మంచి రెస్పాన్స్ వస్తే.. ప్రభాస్ పూర్తి సినిమా తమన్ ఖాతాలో పడటానికి పెద్ద సమయం పట్టదనే చెప్పాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close