బాలకృష్ణ, థమన్ కాంబినేషన్ లో వచ్చిన అఖండ కి మ్యూజిక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖండ కి సెకండ్ హీరో థమనే అన్నంత పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ తో మరోసారి పని చేసే అవకాశం వీరసింహారెడ్డి ఇచ్చింది. పాటలకు మంచి ఆదరణ లభించింది. అయితే జై బాలయ్య సాంగ్ పై మాత్రం కాపీ మరక పడింది. ‘ఒసేయ్ రాములమ్మా’ టైటిల్ సాంగ్ తో పోలికలు వచ్చాయి. తాజాగా ఇదే విషయాన్ని తమన్ దగ్గర ప్రస్తావిస్తే.. నిజమే ఒసేయ్ రాములమ్మా ట్యూన్ ని కాపీ చేశాం. ఈ సాంగ్ చేస్తున్నప్పుడే నాకు. నాకే కాదు.. దర్శకుడు గోపికి, రైటర్ రామజోగయ్య శాస్త్రికి తెలుసని చెప్పుకొచ్చారు తమన్.
”వందేమాతరం శ్రీనివాస్ గారి ఒసేయ్ రాములమ్మ పాటకి నేనే వాయించా. అలాగే వచ్చాడయ్యో సామి పాటని కూడా అందులో నుండే లేపారు. ఇవన్నీ ఒక కల్ట్ ఇమేజ్ వున్న పాటలు. ఈపాట చేస్తున్నపుడే ఒసేయ్ రాములమ్మతో పోలిక వస్తుందని తెలుసు. తెలిసే చేశాం. ఇలాంటి క్రౌడ్ థీమ్ వున్న పాటలు దాదాపు ఒకే పిచ్ లో వుంటాయి. అందుకే ఎక్కడో విన్న ఫీలింగే కలుగుతుంది” అని చెప్పుకొచ్చాడు తమన్. మొత్తానికి తన పాట గురించి క్లారిటీ ఇచ్చుకునే క్రమంలో అందులో నుండి పుట్టిన మరో కాపీ పాటని కూడా ఊదాహరణగా చెప్పడం గమనార్హం.