నేరభారతం : బెయిల్‌పై వచ్చి రేప్ బాధితురాలి తండ్రిని చంపేసిన నిందితుడు..!

ఓ యువతి అత్యాచారానికి గురైంది. తీవ్రంగా గాయాలపాలై చనిపోయింది. నిందితులకు శిక్ష పడాలని కుటుంబసభ్యులు పోరాడుతున్నారు. ఆ నిందితులు ఆమె కుటుంబసభ్యుల్ని దారుణంగా హత్య చేస్తారు. పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం అన్నీ అదే కరెక్ట్ అన్నట్లుగా సహకరిస్తూ ఉంటాయి. ఇదంతా సినిమాల్లో జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ నిజంగానే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

హత్రాస్ అత్యాచార ఘటన గురించి గత ఏడాది దేశం మొత్తం చర్చించుకుంది. యూపీలోని హత్రాస్ జిల్లాలోని పందొమ్మిదేళ్ళ దళిత యువతిపై నలుగురు అగ్ర వర్ణాలవారు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె తీవ్ర గాయాలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆమెను రాత్రికి రాత్రి స్వగ్రామానికి తీసుకు వచ్చి బంధువులకు తుది చూపుకు కూడా నోచుకోకుండానే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఢిల్లీలోని నిర్భయ ఘటనను పోలి ఉండటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయంగానూ కలకలం రేపింది. ప్రియాంక, రాహుల్ హాత్రాస్ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. రేప్ ఘటనపై యూపీ సర్కార్ సిట్ ను నియమించింది.

ఈ కేసులో యూపీ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలతోపాటు కోర్టులు తప్పు పట్టాయి. యువతి అంత్యక్రియల విషయంలో పోలీసులు వ్యహరించిన తీరును అలహాబాద్ హైకోర్టు మండిపడింది. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి ఇచ్చారు. అయితే సమాంతరంగా సిట్‌తో యోగి ఆదిత్యనాథ్ దర్యాప్తు చేయించారు. ఈ కేసును ఎటూ తేల్చకుండా మసిపూసి మారేడుకాయ చేశారు. ఆ తర్వాత కేసులో ఎలాంటి పురోగతి లేదు. చివరికి నిందితులకు బెయిల్ వచ్చింది.

బెయిల్ వచ్చిన వెంటనే రేప్ కేసు ప్రధాన నిందితుడు గౌరవశర్మ.. హత్రాస్ వచ్చారు. తాను రేప్ చేసి చంపేసిన యువతి తండ్రిని దారుణంగా హత్య చేశాడు. నిందితుడి వద్ద తుపాకీ కూడా ఉంది. ఆలయం వద్ద ఉన్న బాధిత యువతి తండ్రిని చంపడానికి ప్లాన్ ప్రకారం వచ్చాడు. నిందితులకు బెయిల్ వచ్చిన తర్వాత.. రేప్ బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉంటుందని తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా బాధిత కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. ఇలా స్వతంత్ర భారతంలో మాత్రమే సాధ్యం. ఇంత అనాగరిక న్యాయం అమలవుతున్న ప్రజాస్వామ్య దేశం.. ఎవరికీ రక్షణ ఉండని.. కల్పించలేని దయనీయమైన వ్యవస్థ మన దేశంలోనే ఉంటుందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరీక్షలు పరీక్షలే..! మోడీ మాట కాదు.. జగన్ బాట..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ చొరవతో సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. ఇంటర్ పరీక్షల్ని అంటే పన్నెండో తరగతి పరీక్షల్ని వాయిదా వేసింది. మోడీనే అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం మాత్రం...

ప్రశ్నలన్నీ వైఎస్ విజయలక్ష్మికే..!

వైసీపీ గౌరవాధ్యక్షురాలికి కాలం అంతగా కలసి రావడం లేదు. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉండి.. మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటే.. తాజాగా షర్మిలపై తెలంగాణ పోలీసులు...

తెలంగాణలో “గుర్తు”ను కోల్పోయిన జనసేన..!

జనసేన పార్టీకి.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఏదీ కలసి రావడం లేదు. బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన...

మోడీ ఎడాపెడా అడిగేస్తున్న జగన్..!

టీకా ఉత్సవ్ అంటూ.. ఉత్సవాలు చేస్తున్నారు కానీ.. టీకాలు మాత్రం కావాల్సినన్ని పంపడం లేదని కేంద్రం వైఫల్యాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజల ముందు పెడుతున్నారు. గత...

HOT NEWS

[X] Close
[X] Close