సీఎం అడగక ముందే వరద సాయం రూ.895 కోట్లిచ్చేశారట !

రాయలసీమ, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయిపోయాయని… తక్షణం రూ. వెయ్యికోట్ల సాయం చేయాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఆ తర్వాత రాజ్యసభలో విజయసాయిరెడ్డి కూడా అడిగారు. సీఎం జగన్ రాసిన లేఖకు స్పందన లేదు కానీ.. పార్లమెంట్‌లో ఎంపీ అడిగారు కాబట్టి వెంటనే సమాధానం బయటకు వచ్చింది. అదేమిటంటే వరదలు రాక ముందే రూ. 895కోట్లు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిందట. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

భారీ వర్షాలు, వరదల వలన సంభవించిన పంట, ఆస్తి నష్టానికి సంబంధించి 895 కోట్ల రూపాయలను రాష్ట్ర విపత్తుల నిధి ( ఎస్‌డిఆర్‌ఎఫ్ ) కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా ముందస్తుగానే విడుదల చేశామని స్పష్టంచేశారు. విపత్తులు సంభవించినపుడు బాధితులకు తక్షణ సాయం, పునరావాసం కల్పించేందుకు ఎస్డీఆర్‌ఎఫ్‌ నుంచి నిధులను వినియోగించేందుకు వీలుగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 1,192.80 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం వాటా 895.20 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 297.60 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటా 895.20 కోట్లను రెండు విడతలుగా ఇచ్చేశామని మంత్రి తెలిపారు.

విపత్తుల నిర్వహణ బాధ్య ప్రాధమికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది. విపత్తులు సంభవించినపుడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి నిధులను వినియోగించి సహాయ చర్యలు చేపట్టవలసి ఉంటుందన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు కేవలం సహాయ చర్యలకు మాత్రమే వినియోగించాలి తప్ప నష్టపరిహారం చెల్లించడానికి కాదని స్పష్టం చేశారు. అంటే ఇక కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందదరని పరోక్షంగా కేంద్రం చెప్పినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌: ‘మెగా’ కార్నివాల్‌

ఆగ‌స్టు 22... చిరంజీవి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తీ యేడాది.. శిల్పారామంలో చిరు అభిమానుల‌తో ఓ పెద్ద వేడుక నిర్వ‌హించ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంది. ఈసారి ఈ వేడుక‌ని ఇంకాస్త భారీ...

బీజేపీలో టిక్కెట్ ఇస్తారో లేదోనని విజయశాంతి అసంతృప్తి !

బీజేపీలోనూ విజయశాంతి ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. తనకు ప్రాధాన్యం దక్కడం లేదని కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆమె మీడియా ముందే వాపోయారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న విజయశాంతి...

చిరు బ‌ర్త్ డే గిఫ్టులు.. ఓ రేంజ్‌లో!

ఆగ‌స్టు 22న చిరంజీవి పుట్టిన రోజు. అందుకోసం చిరు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి బ‌ర్త్ డే గిఫ్టులు ఓ రేంజ్‌లో ఉండ‌బోతున్నాయి. చిరు న‌టిస్తున్న మూడు సినిమాలు ఇప్పుడు...

‘బింబిసార 2’.. టార్గెట్ ఫిక్స్‌!

'బింబిసార' త‌ర‌వాత పార్ట్ 2 వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. కానీ ఎవ‌రికీ న‌మ్మ‌కాల్లేవు. 'ముందు బింబిసార 1 హిట్ట‌వ్వాలి క‌దా..' అనుకొన్నారు. తీరా చూస్తే `బింబిసార` సూప‌ర్ హిట్ట‌య్యిపోయింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close