చిన్న సినిమానా పెద్ద సినిమానా పాయింట్ కాదు. ఒక మంచి సినిమా తమ ఆడియన్స్ ని వెతుక్కుంటూ వెళుతుంది. తిరువీర్ హీరోగా నటించిన ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ఇప్పుడు అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసింది. ఎలాంటి బజ్ లేకుండా విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఉత్తర అమెరికాలో $100,777+ వసూళ్లను దాటి ముందుకు సాగడం విశేషం.
సింపుల్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా ఇది. పెద్ద ప్రమోషన్స్ కూడా లేవు. కాకపోతే మంచి రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఎలాంటి కమర్షియల్ లెక్కలు లేకుండా నిజజీవితానికి దగ్గరగా సున్నితమైన హాస్యంతో తీసిన ఈ సినిమాకి క్రమంగా పుట్ ఫాల్స్ పెరిగాయి.
ఓవర్సిస్ ఆడియన్స్ అభిరుచి వేరు. సినిమా బావుందంటే ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు. ఒక మాస్ సినిమాలా ఎగబడిపోవడం ఉండకపోవచ్చు కానీ వీలు చేసుకొని మరీ ఇలాంటి సినిమాలని ఆదరిస్తారు. ఫిల్మి మేకింగ్ లో నిజాయితీ వుంటే వారి చూపు సినిమాపై పడుతుంది. ఈ సినిమాకి కూడా ఇదే జరిగింది. ఓవర్సిస్ ఆడియన్స్ ఈ సినిమాకి ఇస్తున్న రెస్పాస్ మంచి సినిమా బలాన్ని మరోసారి రుజువుచేసింది.

