ఏపీలో అత్యంత ప్రమాదకరమైన కరోనా మ్యూటెంట్ : సీసీఎంబీ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ రకాల్లో అత్యంత ప్రమాదకర రకాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. N-440Kగా పిలిచే ఈ రకం వైరస్ ఆనవాళ్లు.. కర్నూలు కోవిడ్ పేషంట్లలో కనిపించాయి. ఇతర వైరస్‌ల కన్నా 10 రెట్లు N-440K వైరస్‌ ప్రభావం చూపుతుందని అంచనా అంచనా వేశారు. ఏపీలో మరణాలు అనూహ్యంగా పెరిగిపోతూండటం… కేసుల సంఖ్య పెరగడం… రికవరీలు తగ్గిపోవడంతో… ప్రమాదకరమైన మ్యూటేషన్లు ఏపీలో విస్తరించినట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించింది. పగటి పూట కూడా కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయించింది.

ఐదో తేదీ నుంచి రెండు వారాల పాటు… కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇప్పుడు పగటి పూట కూడా.. కర్ఫ్యూ అమలు చేస్తారు. ఉ.6 గంటల నుంచి మ.12 గంటల వరకు దుకాణాలకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తారు. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేస్తారు. అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. ఏపీ ఆస్పత్రుల్లో హాహాకారాలు వినిపిస్తున్నాయి. పది మంది.. ఇరవై మంది చనిపోతున్నారు. ఆక్సిజన్ కొరత వల్లేనని.. మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.

అయితే ఆక్సిజన్ కొరతే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు ఆక్సిజన్ విదేశాల నుంచి అయినా సరే కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించినట్లుగా ప్రెస్ నోట్లు విడుదలవుతున్నాయి. మొత్తంగా చూస్తే ఏపీలో కరోనా పరిస్థితి.. బయటకు చెప్పనంత తీవ్రంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close