ప్రభాస్ అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూసిన రాజాసాబ్ టీజర్ బయటకు వచ్చింది. ప్రభాస్ మార్క్ వినోదం, మారుతి మార్క్ హారర్ కామెడీతో కూడిన టీజర్ అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ను అందించింది.
‘ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం… నా తదనంతరం కూడా దీన్ని నేనే అనుభవిస్తాను’ అనే వాయిస్‌తో టీజర్ మొదలైంది. ఈ డైలాగ్‌తో రాజాసాబ్ మూలకథను దాదాపు రివీల్ చేశారు. తన సంపదపై ఆశ తీరని ఓ మహారాజు… చనిపోయిన తర్వాత కూడా ఆత్మగా ఆ మహల్లో ఉంటాడు. అలాంటి మహల్‌కి ప్రభాస్ ఎందుకు వచ్చాడు? ఏం చేశాడనేది మిగతా కథాంశం.
టీజర్లో ప్రభాస్ లుక్, పెర్ఫార్మెన్స్ మేజర్ హైలైట్. ఇలాంటి ఫన్ ఫుల్ క్యారెక్టర్లో డార్లింగ్‌ను చూసి చాలా కాలం అయ్యింది.
-హలో హలో బండి కొంచెం మెల్లగా
-అసలే మన లైఫ్ అంత అంత మాత్రం
-నేరాలు పాపాలు ఏమిటండీ డిగ్నిఫైడ్‌గా లవ్ చేత్తెనో
-మేడం ఏదో తాగిన మత్తులో కరేసినట్లు ఉన్నాను
-హే జగన్నాథ ప్రభూ క్యా హువా
-తాత వైర్ కోరికేసాడేమో చూడండ్రా బయట…
టీజర్లో ప్రభాస్ పలికిన ఈ డైలాగులన్నీ భలే పేలాయి. వింటేజ్ ప్రభాస్‌ను గుర్తుకు తెచ్చాయి. మారుతి తనకు మాగా కలిసొచ్చిన హారర్ కామెడీ ‘రాజాసాబ్’లో మరోస్థాయిలో చూపించారని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ఓ మహల్ చుట్టూ సాగే కథ ఇది. యాక్షన్ కూడా కావలసినంత ఉంది. ముఖ్యంగా సిజీ వర్క్ బావుంది. విజువల్స్ మంచి క్వాలిటీతో ఉన్నాయి. ప్రభాస్ ని మరోసారి ఓ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో చూడాలని ఎదురుచూసే ఫ్యాన్స్ కోరికను రాజాసాబ్ తీర్చేలానే ఉంది. మొత్తానికి టీజర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది.