విద్యుత్ సంస్కరణల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం చేసిన విమర్శలు ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోరు. వాటిని విమర్శలు అనడం కంటే… తిట్లు అనడం కరెక్ట్. ఏపీ ప్రభుత్వం రూ. మూడు వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయ బోర్లకు కరెంట్ మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరి బిగిస్తోందని హరీష్ రావు లాటి వారు చెబుతూ వస్తున్నారు. దానికి తాము అంగీకించేది లేదన్నారు. అయితే ఇప్పుడు తాము విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం పంపింది.తీవ్ర ఇక్కట్లలో ఉన్న డిస్కంలు బయటపడాలంటే సంస్కరణలు అమలు చేయాల్సిందేనని భావిస్తున్నారు.
విద్యుత్ సంస్కరణల్లో చాలా అంశాలు ఉన్నాయి. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం.. ప్రభుత్వం ఎవరికీ ఉచిత విద్యుత్ ఇవ్వకపోవడం..ఎవరికైనా ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే ప్రభుత్వం ఆ సొమ్మును నగదు బదిలీ కింద ప్రయోజనాలు పొందే వారికే ఇవ్వాలని… విద్యుత్ సంస్థలకు ముడిపెట్టకూడదని చెబుతూ వస్తున్నాయి. అయితే వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడితే రైతుల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడం లేదు . ఇప్పుడు కూడా తాము సంస్కరమణలు అమలు చేస్తాం కానీ వ్యవసాయ బోర్లకు మీటర్లు మాత్రం పెట్టబోమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే సంస్కరణలకు అంగీకారం తెలిపితే ఇప్పుడు కాకపోతే… రేపైనా ఆ పని చేయాల్సిందేన్న అభిప్రాయం ఉన్నతాధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. వ్యవసాయ బోర్లకు కరెంట్ వినియోగంపై లెక్క ఉండాలని డిస్కంలకు ప్రభుత్వం ఆ మేరకు చెల్లింపులు చేస్తేనే ఆ సంస్థలు మనుగడ సాగిస్తాయని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇలా ఉచిత విద్యుత్, ఎత్తిపోతల ప్రాజెక్టులకు వినియోగించే విద్యుత్‌కు .. ఇతర వర్గాలకు ఇచ్చే సబ్సిడీకి సంబంధించిన నిధులను జమ చేయడం లేదు. అరకొరగా ఇస్తోంది. అవి ఇస్తే డిస్కంలకు సమస్య ఉండదు. ప్రభుత్వాలు ఇవ్వవు. అందుకే కేంద్రం సంస్కరణలు తెచ్చింది. చివరికి కేసీఆర్ అంగీకరించాల్సి వచ్చింది.