“టైమ్స్‌ నౌ”లో కల్లోలం… ఎలక్షన్ కవరేజ్ సస్పెన్షన్..!

ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ చానల్ టైమ్స్‌నౌలో కల్లోలం రేగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మే రెండో తేదీన ఎన్నికల కవరేజీని సస్పెండ్ చేస్తున్నట్లుగా టైమ్స్ నౌ ప్రకటించింది. కరోనా అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లుగా టైమ్స్ నౌ చేసిన ట్వీట్‌లో వెల్లడించింది. అయితే.. కరోనాపై దృష్టి పెట్టడానికి ఎన్నికల కవరేజీని బహిష్కరించాల్సిన అవసరం ఏమిటో .. మీడియాలోని ఇతర వర్గాలకు పెద్దగా అర్థం కావడం లేదు. కానీ… టైమ్స్‌నౌలో అంతర్గత సంక్షోభం ముదిరి పాకాన పడిందన్న ప్రచారం మాత్రం ఉద్ధృతంగా సాగుతోంది. మూడు నాలుగు రోజుల కిందట… ఆ చానల్‌కు చెందిన జర్నలిస్టులు… ఎడిటర్స్‌కు సంచలనాత్మక లేఖ రాశారు. మీడియా చానల్‌గా ప్రజల కోసం కాకుండా బీజేపీ కోసం పని చేస్తోందని ఆ లేఖలో విమర్శించారు.

జర్నలిస్టులుగా మన చుట్టూ ఏం జరుగుతోందో మనకు తెలుసు. కరోనా దుర్భర పరిస్థితులు కళ్ల ముందే ఉన్నాయి. బెడ్‌ కోసం వీధుల్లో, అంబులెన్సుల్లో పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నవారు కొందరు ఆక్సిజన్‌ దొరక్క అల్లాడుతున్నారు. కొందరు నిర్భాగ్యులు కన్నుమూస్తున్నారు. ప్రాణాధార ఔషదాలు దొరకడం లేదు. మొత్తం వ్యవస్థ కుప్పకూలింది. అయినప్పటికీ.. ప్రతిపక్షాలనే నిందిస్తున్నాం. అసలైన విషయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాం,, హిందూ ముస్లిం విభేదాలు పెంచే చర్చలు నడుపుతున్నామని వారు ఆ లేఖలో నిలదీశారు. కోవిడ్‌ నిబంధనలు పాటించకుండా పెద్దపెద్ద ర్యాలీలు నిర్వహించే ప్రతిపక్ష నేతల వీడియోలు చూపిస్తాం. అదే పని చేస్తున్న అమిత్‌ షా ఫొటో కూడా చూపించం. అంత వెన్నెముక లేకుండా తయారయ్యామని లేఖలో మండిపడ్డారు

మీ ముందున్న ప్రశ్న చాలా చిన్నది. ప్రజల పక్షాన నిలుచోవాలా? లేక బిజెపి పక్షాన నిలుచోవాలా? బిజెపి పక్షాన నిల్చోవడం అంటే మీరు మీ వృత్తి ధర్మానికే కాదు.. ఈ దేశానికే ద్రోహం చేస్తున్నట్లు. అని లేఖలో తేల్చి చెప్పారు. ఈ లేఖ టైమ్స్‌ నౌలో సంచలనాత్మకం అవుతోంది. ఇప్పుడు ఎలక్షన్ కవరేజీని కరోనా కారణంగా బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ.. కరోనా కారణం కాదని.. ఆ లేఖ ద్వారా ఏర్పడిన సంక్షోభం వల్లనే… ఎలక్షన్ కవరేజీని బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించినట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐడీపై సుప్రీంకోర్టుకెళ్లిన ఏబీఎన్, టీవీ5..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా...

కరోనా అనాథల్ని చేసిన పిల్లలకు అండగా జగన్..!

కరోనా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు ముసిరేలా చేస్తోంది. కొన్ని చోట్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా.. మరికొన్ని చోట్ల..తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయి చిన్నారు అనాథలవుతున్నారు. ఒకటో.. రెండో కాదు.. దాదాపుగా ప్రతి ఊరిలోనూ...

రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.....

ఈ సారీ కౌంటర్ దాఖలుకు సీబీఐ, జగన్‌కు తీరలేదు..!

రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి వారాలకు వారాల గడువు సీబీఐకి సరిపోవడం లేదు. ఒక్క సీబీఐకే కాదు.... నిందితుడైన జగన్మోహన్ రెడ్డికీ...

HOT NEWS

[X] Close
[X] Close