చేయవచ్చు కానీ అతి చేయకూడదని సెటైరిస్టులు అంటూ ఉంటారు. అలాంటివి ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎంతగా అంటే.. ఆ అతి కూడా సహజం ఏమో అని డౌట్ ఇచ్చేంత. ఓ టీవీ చానల్ లో హైదరాబాద్ లో తమ ప్రమోషన్ల కోసం.. స్పాన్సర్లను రాబట్టి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకునేందుకు శక్తిని అమ్ముకునేందుకు దీపోత్సవం నిర్వహిస్తుంది. దానికి మంత్రుల్ని , కేంద్ర మంత్రుల్ని పిలిపించుకుని డబ్బా కొట్టించుకుంటుంది. అయితే ఈ ఏడాది కాస్త అతి చేశారు. ఏంటంటే.. ఆ కార్యక్రమాన్ని జాతీయ పండుగగా.. రాష్ట్ర పండుగగా చేస్తారని ప్రకటించుకోవడం.
ఈ దీపోత్సవానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చారు. ఆయన జాతీయ పండుగగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత సీఎం రేవంత్ కూడా వెళ్లారు. రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామన్నారు. దీన్ని ఆ చానల్ గప్పాలు కొట్టుకుంటున్నాయి. నిజానికి వారిద్దరూ అలాంటి ప్రకటనలు చేశారంటే.. ఆ చానల్ యాజమాన్యం రిక్వెస్ట్ చేసి ఉంటుంది. అందుకే ఓ మంచి మాట చెప్పి ఆనందపడితే పోలా అనుకుని ఉంటారు. కానీ తమ ప్రోగ్రాం ఏంటి.. జాతీయ పండుగ, రాష్ట్ర పండుగ ఏంటి అన్న ఆలోచనలు వారు చేయలేదు.
జాతీయ పండుగగా ప్రకటించాలంటే ఆ వేడుక జాతీయ ఐక్యత, స్వాతంత్ర్య పోరాటం, జాతీయ విలువలుకు సంబంధించినదై ఉండాలి. కేబినెట్ కమిటీ ఆమోదం , పార్లమెంటులో తీర్మానం ద్వారా ఆమోదం పొందాలి. ఇక్కడ కొసమెరుపేమిటంటే మతపరమైన పండుగలు దీపావళి, ఈద్, క్రిస్మస్ వంటి వాటిని కూడా జాతీయ పండుగలుగా ప్రకటించబడలేదు. అవి ప్రభుత్వ సెలవులు మాత్రమే. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పండుగగా ప్రకటించాలన్నా ఆ ప్రాసెస్ ఉంటుంది. ఇలాంటి ప్రైవేటు కార్యక్రమాలకు అలాంటి హోదా ఇవ్వడం సాధ్యం కాదు. అయినా ఆ చానల్ అత్యాశ అలా ఉంది.