ఒక్క థియేట‌ర్ కూడా ఇవ్వ‌డం లేదు : నారాయ‌ణ మూర్తి ఆవేద‌న‌

ఈ సంక్రాంతికి వ‌స్తున్న రెండు పెద్ద సినిమాల‌తో రెండు చిన్న సినిమాలు పోటీకి దిగాయి. అవే… శ‌తమానం భ‌వ‌తి, హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రా య్య‌. శ‌తమానం భ‌వతి దిల్‌రాజు సినిమా కాబ‌ట్టి ఆయ‌నకు థియేట‌ర్ల కొర‌త లేదు. ఎటొచ్చి నారాయ‌ణమూర్తి సినిమానే బ‌లైపోతోంది. ఈనెల 14న విడుద‌ల కాబోతున్న ఈ చిత్రానికి ఒక్క థియేట‌ర్ కూడా ద‌క్క‌లేద‌ట‌. దాంతో రెడ్ స్టార్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ”చిరంజీవి, బాల‌కృష్ణ మ‌ధ్య‌లో పీపుల్ స్టార్ అంటున్నారు. వాళ్ల‌తో నాకు పోటీ లేదు. అయితే…నా సినిమాకి ఒక థియేట‌ర్ కూడా దొర‌క‌ని ప‌రిస్థితి. ఒక థియేట‌ర్ కూడా దొర‌క‌డం లేదు అంటే ఏడుపు వ‌స్తుంది. కొంత మంది చేతుల్లో థియేట‌ర్స్ ఉండడ‌డం వ‌ల‌న ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చింది. చిన్న సినిమాకి ధియేట‌ర్స్ దొర‌కక‌పోవ‌డం అంటే దుర్మార్గం చ‌ర్య‌. చిన్న సినిమాల‌కు థియేట‌ర్స్ ల‌భించేలా చూడాల్సిన బాధ్య‌త ఫిల్మ్ ఛాంబ‌ర్, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్, గ‌వ‌ర్న‌మెంట్ పై ఉంది. క్రేజ్ ని క్యాష్ చేసుకోవ‌డం కోసం ఒకే సినిమాని అన్ని థియేట‌ర్స్ లో వేస్తున్నారు. చిన్న సినిమాలు పండ‌గ లేన‌ప్పుడు, పెద్ద సినిమాలు లేన‌ప్పుడు రిలీజ్ చేయాలా..? స‌క్సెస్ ఫెయిల్యూర్ అనేది జ‌నం నిర్ణ‌యిస్తారు. ఇండ‌స్ట్రీ ఏ ఒక్క‌రిదో కాదు.. అంద‌రిది. చిన్న సినిమాల‌కు న్యాయం చేయ‌మ‌ని కోరుతున్నాను” అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారాయ‌న‌.

నిజానికి ఈ సినిమాని సంక్రాంతికి విడుద‌ల చేసే ఉద్దేశం చిత్ర‌బృందానికి లేదు. అది స‌డ‌న్‌గా తీసుకొన్న నిర్ణ‌యమే. ఈ సినిమాకి క‌నీసం 50 థియేట‌ర్ల‌యినా దొరుకుతాయ‌ని చిత్ర‌బృందం భావించింది. కానీ ప‌ట్టుమ‌ని 20 థియేట‌ర్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. అయినా స‌రే.. ఏదోలా థియేట‌ర్లు ద‌క్కించుకోవాల‌ని చ‌ద‌ల‌వాడ ప్ర‌య‌త్నిస్తున్నారు. అనుకొన్న థియేట‌ర్లు దొర‌క్క‌పోయినా.. త‌మ సినిమాని విడుద‌ల చేయ‌డం ఖాయ‌మ‌ని చ‌ద‌ల‌వాడ చెబుతున్నారు. సో.. పీపుల్స్ వార్ ఈ సంక్రాంతికి జెండా ఎగ‌రేయాలనే నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌న్నమాట‌. మ‌రి ఈ సినిమాకి ఎన్ని థియేట‌ర్లు దొరుకుతాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌థ‌లు వింటున్న త్రివిక్ర‌మ్‌

స్వ‌త‌హాగా త్రివిక్ర‌మ్ మంచి ర‌చ‌యిత‌. ఆ త‌ర‌వాతే ద‌ర్శ‌కుడ‌య్యాడు. త‌న క‌థ‌ల‌తోనే సినిమాలు తీశాడు. తీస్తున్నాడు. `అ.ఆ` కోసం ఓ న‌వ‌ల ని ఎంచుకున్నాడు. ర‌చ‌యిత్రికి కూడా క్రెడిట్స్ ఇచ్చాడు. అయితే.. క‌థ‌ల...

ఆత్మ‌క‌థ రాస్తున్న బ్ర‌హ్మానందం

అరగుండుగా `అహ‌నా పెళ్లంట‌`లో న‌వ్వించాడు బ్ర‌హ్మానందం. అది మొద‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కూ వంద‌లాది చిత్రాల్లో హాస్య పాత్ర‌లు పోషించి, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. ప‌ద్మ‌శ్రీ‌తో ప్ర‌భుత్వం...

క‌మ్ బ్యాక్ కోసం నిత్య‌మీన‌న్ ఆరాటం

అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడే ఒడిసిప‌ట్టుకోవాలి. అవి చేజారిపోయాక‌.. ఆరాట‌ప‌డ‌డంలో అర్థం లేదు. చిత్ర‌సీమలో అవ‌కాశ‌మే గొప్ప‌ది. దాన్ని ఎంత వ‌ర‌కూ స‌ద్వినియోగం చేసుకుంటామ‌నే విష‌యంపైనే కెరీర్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఆ సంగ‌తి నిత్య‌మీన‌న్‌కి ఇప్పుడిప్పుడే...

గీతా ఆర్ట్స్‌లో వైష్ణ‌వ్ తేజ్‌

గీతా ఆర్ట్స్‌కీ, మెగా హీరోల‌కూ ఓ సెంటిమెంట్ ఉంది. తొలి సినిమాని బ‌య‌టి బ్యాన‌ర్‌లో చేయించి, రెండో సినిమా కి మాత్రం గీతా ఆర్ట్స్ లో లాక్ చేస్తుంటారు. రామ్ చ‌ర‌ణ్ అంతే....

HOT NEWS

[X] Close
[X] Close