ఓటేస్తున్నారా ? : కష్టాల్లో నేనున్నానని భరోసా ఇచ్చే పాలకుడెవరో ఆలోచించండి !

ఓ డ్యామ్ పగిలిపోయింది.. కొట్టుకుపోయింది. డ్యామ్ అంటే చిన్న విషయం కాదు. ఆ డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయిందన్న సంగతి తర్వాత ముందుపాలకుడు ఏం చేయాలి ?. ఉన్న పళంగా అక్కడికి వెళ్లి అధికారులంద్రనీ అప్రమత్తం చేసి ప్రాణనష్టం తగ్గించి.. బాధితుల్ని ఆదుకోవాలి. భరోసా ఇవ్వాలి. కానీ ఘనత వహించిన సీఎం జగన్… తాడేపల్లి ప్యాలెస్ లో హాయిగా రెస్ట్ తీసుకున్నారు. ఆయన తరపున రెండు ఎలివేషన్ లెటర్స్ పీఆర్ టీం విడుదల చేసింది. ఎందుకు వెళ్లలేదయ్యా… అని తర్వాత ఎప్పుడో మీడియా ప్రశ్నిస్తే.. ఆయన సలహాదారు గారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. సీఎం వెళ్తే పనులకు అడ్డం… అందుకే వెళ్లలేదని. నిజమే కదా.. చేతకాని సీఎం ఇంట్లో ఉండటమే మంచిదని అప్పుడే చెప్పకనే చెప్పారు. అది సొంత జిల్లా దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ఊడిగం చేస్తున్నారు. అయినా మనసు కరగలేదు. ఇప్పటికీ కరగలేదు. టెంట్లలో బతికేస్తున్నారు బాధితులు. ఇసుక తవ్వకాల కుట్రలకే ఆ డ్యాం బలైపోయిందని కేంద్రం కూడా చెప్పింది. కానీ అంతా గప్ చుప్ సైలెన్స్.

ఈ అన్నమయ్య డ్యాం ఘటన ఓ మచ్చుతునక. ఇలాంటి విపత్తలు ఎన్ని జరిగాయో లెక్కే లేదు. ఓ సారి తప్పనిసరిగా వెళ్తే పొలాల దగ్గర స్టేజి వేయించుకుని రెడ్ కార్పెట్ స్వాగతంతో పొలాల్ని పరిశీలించారు. ఇంత ఫ్యూడల్ మైండ్ సెట్ తో ఉండే పాలకుడు ప్రజలకు ఎలా మేలు చేస్తాడు ?. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చే ముందు ఉత్తరాంధ్రను తీత్లీ తుఫాను వణికించింది. ప్రభుత్వం ప్రతీ చెట్టూపుట్టకు లెక్క కట్టి ఎంతో కొంత సాయం ప్రజలకు చేసింది. కానీ కనీసం పరిశీలన కూడా చేయని ప్రతిపక్ష నేత జగన్ తాను రాగానే రెట్టింపు సాయం ఇస్తానని ప్రకటించి ఓట్లు దండుకున్నారు. ఐదేళ్లయింది. ఎవరికీ పైసా కూడా సాయం చేయలేదు. ఇక జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని విపత్తలు వచ్చినా … పైసా సాయం చేయలేదు. ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తానని కబుర్లు చెబుతారు. ఎకరానికి మూడో.. నాలుగో వందలు రైతుల మొహాన కొట్టి అదే సాయం అంటారు.

కరోనా సమయంలో ప్రభుత‌్వ నిర్లక్ష్యం గురించి కథలు కథలుగా చెప్పుకోవచ్చు. తిరుపతిలో ఆక్సీజన్ సరఫరా నిర్లక్ష్యం కారణంగా ఊపిరి వదిలిన ప్రాణాలే దానికి సాక్ష్యం. ఇక వైద్యం అందక.. చనిపోయిన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. కరోనా సెకండ్ వేవ్‌లో ఎన్ని లెక్కలోకి రాని ప్రాణాలు పోయాయో లెక్కలేదు. అంతేనా కరోనా కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్ని కూడా పక్కదారి పట్టించారు. కరోనా బారిన పడిన వారికి మూడు మాస్కులు ఇస్తామని… డిశ్చార్జ్ అవుతున్న వారికి రూ. రెండు వేలు ఇస్తామని.. చనిపోయిన వారికి పదిహేను వేలు ఇస్తామని గొప్పగా ప్రకటనలు చేశారు. ఎవరికీ పైసా ఇవ్వలేదు. చివరికి మూడు మాస్కులు కూడా ఇవ్వలేదు. కానీ ప్రభుత్వ ప్రచారం మాత్రం.. బతికి ఉన్న వారంతా ప్రభుత్వ కృషి వల్లే బతికారని చెప్పుకోవడం. ఓ సారి కేరళ ఎంపీ ఒకరు సీఎం సొంత జిల్లా కడపకు వచ్చారు. అప్పుడు కడపకు తుపాను ముప్పు పొంచి ఉంది. భారీ తుపాను వస్తూంటే… అధికారులు ఎలా పని చేస్తున్నారో చూద్దామని ఎంపీ కడప కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ ఎవరూ లేరు. పోనీ ఫీల్డ్‌లో ఉన్నారేమో అనుకున్నారు. కానీ వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సెకండ్ సాటర్ డే అని ఎవరూ రాలేదట. ఆ వరదల్లో కడప జిల్లా ఎంతో నష్టపోయింది. కానీ ఎవరి సావు వాళ్లు చచ్చారు.

కానీ రూపాయి సాయానికి వెయ్యిరూపాయల పబ్లిసిటీ చేసుకోవడంలో జగన్ రెడ్డి ఎప్పుడూ ముందు ఉంటారు. సాక్షి పత్రికకు వందల కోట్ల ప్రకటనలు ఇస్తారు. బాకా ఊదే కూలి మీడియాకు.. కొంత విదిలిస్తారు. కానీ అసలు పేదలకు.. బాధితులకు మాత్రం.. మొండి చేయి చూపిస్తారు. ఇలాంటి పాలకుడ్ని కొనసాగించేందుకు ఓటు వేస్తే.. అది ఎవరి నెత్తి మీద వారు చేయి పెట్టుకున్నట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close