ఈవారం బాక్సాఫీస్‌: ముక్కోణ‌పు పోటీ

గ‌తవారం బాక్సాఫీసుకి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. మూడు సినిమాలు వ‌స్తే… మూడూ ఫ్లాపులే. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నేను మీకు బాగా కావ‌ల్సిన‌వాడిని, శాకిని, డానికీ – బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. ఈ వారం కూడా ముచ్చ‌ట‌గా మూడు సినిమాలొస్తున్నాయి. అల్లూరి, కృష్ణ వ్రింద విహారి, దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌…. ఈ మూడూ శుక్ర‌వార‌మే విడుద‌ల అవుతున్నాయి. మూడింటిపైనా మంచి అంచ‌నాలే ఉన్నాయి.

శ్రీ‌విష్ణు హీరోగా న‌టించిన `అల్లూరి` ట్రైల‌ర్ ప్రామిసింగ్ గా ఉంది. పోలీస్ క‌థ‌లంటే క‌మ‌ర్షియాలిటీకి అడ్డా. ట్రైల‌ర్‌లో ఆ హంగులు క‌నిపిస్తున్నాయి. ఈ సినిమా ఫ‌లితంపై శ్రీ‌విష్ణు కూడా ధీమాగానే ఉన్నాడు. ఇక నాగ‌శౌర్య రొమాంటిక్ కామెడీ జోన‌ర్‌లో చేసిన సినిమా `కృష్ణ వ్రింద విహారి`. శౌర్య‌కు ఈ జోన‌ర్ బాగా క‌లిసొచ్చింది. `అలా ఎలా`తో హిట్టు కొట్టిన అనీష్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. త‌న‌కీ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్‌లు అచ్చొచ్చాయి. అందుకే వీరిద్ద‌రి కాంబోపై న‌మ్మ‌కాలు ఏర్ప‌డ్డాయి. కీర‌వాణి త‌న‌యుడు శ్రీ‌సింహా హీరోగా `దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌` కూడా ఈవార‌మే వ‌స్తోంది. ట్రైల‌ర్ ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. కారులో హీరో ఇరుక్కుపోతే ఏమ‌వుతుంది? అనేదే సినిమా క‌థ‌. సినిమాలో ఎక్కువ భాగం ఒకే లొకేష‌న్‌లో జరుగుతుంది. ఇదో కొత్త కాన్సెప్ట్ అనుకోవొచ్చు. అల్లూరి యాక్ష‌న్ డ్రామా, కృష్ణ వ్రింద విహారి రొమాంటిక్ కామెడీ అయితే… దొంగ‌లున్నారు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా. మూడూ మూడు రుచులు పంచ‌డానికి రెడీ అయ్యాయి. మ‌రి… వీటిలో ప్రేక్ష‌కుల ఓటు దేనికో తెలియాలంటే శుక్ర‌వారం వ‌ర‌కూ ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close