రాప్తాడు రివ్యూ : తోపుదుర్తి కక్కుర్తితో వైసీపీపై వ్యతిరేకత !

రాప్తాడు అంటే పరిటాల ఫ్యామిలీ కంచుకోట. అయితే గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల కంచుకోటలన్నీ కూలిపోయాయి. జేసీ బ్రదర్స్, పరిటాల ఫ్యామిలీ కూడా ఓడిపోయింది. రాప్తాడులో అనూహ్యంగా పాతిక వేల ఓట్ల తేడాతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచారు. అంతకు ముందు రెండు సార్లు ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఆ సానుభూతి కోసం.. ఇంటింటికి కుటుంబసభ్యుల్ని పంపించి అప్పుల పాలయ్యామని.. మరోసారి ఓడిపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని ఏడుస్తూ ఓడ్లు అడిగించారు. అది బాగా ప్రభావం చూపించింది.

అంత దీనంగా ఓట్లడిగి గెలిచిన తర్వాత ఆయనేం చేశారు ?. ప్రజలు సంపాదించుకోవడానికే చాన్సిచ్చారని అనుకున్నారు. ఐదేళ్లుగా ఆయనది అదే పని. దోచుకోవడం..దాచుకోవడం. అప్పుల పాలయ్యానని చెప్పుకున్న ఆయన ఇప్పుడు వెయ్యి కోట్లకుపైగా ఆస్తిపరుడయ్యారు. ఆయన కుటుంబం కుబేరులయ్యారు. ఆయన సంపాదన ఎలా ఉంటుదంటే.. అంతర్జాతీయ బ్రాండ్ జాకీ కంపెనీ రాప్తాడులో పరిశ్రమ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే… కమిషన్ ఇవ్వలేదని బెదిరించి పంపేశారు. కొన్ని వందల మంది ఉపాధికి దూరం చేశారు. అయినా ఆయన నిర్లజ్జగా ఎదురుదాడి చేస్తూనే ఉంటారు. ఇది ఒక్కటి కాదు.. రాప్తాడు.. ప్రకాష్ రెడ్డి ట్యాక్స్ కామన్ అయిపోయింది.

పరిటాల సునీత ఎప్పుడు గెలిచినా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా నియోజకవర్గంలో పుష్కలంగా పనులు జరిగేవి. లా అండ్ ఆర్డర్ పర్ ఫెక్ట్ గా ఉండేది. వైసీపీ నేతలు కూడా దిలాసాగా ఉండేవారు. కానీ గత ఐదేళ్లుగా పరిస్థితి దిగజారింది. ప్రభుత్వం మారితే మా పరిస్థితేమిటని భయపడేలా వైసీపీ నేతలు ఉన్నారు. కొంత మంది టీడీపీలో చేరిపోతున్నారు. చేరికలు భారీగా పెరగడం దానికి నిదర్శనం. గత ఎన్నికల్లో ఓటమి పాలైన సానుభూతి, అధికార పార్టీపై వ్యతిరేకత , రాప్తాడులో అభివృద్ది కార్యక్రమాలు జరగకపోవడం వంటివి సునీతకు సానుకూలాంశాలుగా కనిపిస్తున్నాయి. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరులు, అనుచరుల అక్రమాలను పరిటాల సునీత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.

జనసేనతో పొత్తు కూడా తమకు ప్లస్ అవుతుందని టీడీపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. మరోవైపు రాప్తాడులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలేదని స్వయంగా ప్రకాష్ రెడ్డే ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.
గత డిసెంబరులో ప్రకాష్‌రెడ్డి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ నియోజకవర్గానికి తాను ఎంతో చేయాలనుకున్నానని ఏమీ చేయలేకపోయానని వ్యాఖ్యానించారు. అందుకు తన మీద తనకే చాలా అసంతృప్తిగా ఉందన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా రాప్తాడు నియోజకవర్గంలో 100 రోజుల్లో రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తామని రోడ్లు పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని సవాల్ చేశారు. కానీ రోడ్లు కాదు కదా.. మట్టి కూడా తోలించలేకపోయారు. తమ సొంత గ్రామానికి 5 ఏళ్లు రోడ్డు వేయలేకపోయారని ప్రజల్లోనూ అసంతృప్తి కనిపిస్తోది.

వైసీపీ నేతలు అధికారం అందిందన్న అహంకారంతో ఇష్టం వచ్చినట్లుగా దోపిడీలకు పాల్పడ్డారు. రాప్తాడులో ఇప్పుడు వారి సంపాదనే చర్చనీయాంశమయింది.. ఓటింగ్ అంశంగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close