కృష్ణమోహన్ రెడ్డి అన్న, బాలాజీ గోవిందప్ప అన్న, ధనుంజయ్ రెడ్డి అన్న అని జగన్ రెడ్డి పిలుచుకునే ముగ్గురు లిక్కర్ కేసు అన్నలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేిసంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన కాసేపటికే వీరికి బెయిల్ మంజూరు చూస్తే ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రూ.1 లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించి , తమ పాస్‌పోర్టులను కోర్టుకు ఇవ్వాలని ఆదేశించింది.
YSRCP హయాంలో లిక్కర్ పాలసీలో అక్రమాలు, కమిషన్ల ద్వారా రూ.3,200 కోట్లు మళ్లించారని ఆరోపణ. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే రెండు చార్జ్షీట్లు దాఖలు చేశారు. ఆగస్టు 18న ఈ నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. 90 రోజుల రిమాండ్ ముగిసిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ కోసం దరఖాస్తు చేసిన సమయంలో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దర్యాప్తు దశ, ఇప్పటికే కస్టడీలో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇచ్చారు.
SIT దర్యాప్తు కొనసాగుతోంది, మరిన్ని చార్జ్షీట్లు దాఖలు చేయనున్నారు. ఫైనాన్షియల్ రికార్డులు, విట్నెస్ స్టేట్మెంట్లు, డిజిటల్ ఎవిడెన్స్ సేకరణలో పురోగతి ఉంది. రాజ్ కెసిరెడ్డి వంటి కీలక నిందితులకు మాత్రం బెయిల్ లభించడం లేదు. వారు మరిన్ని ప్రయత్నాలు చేస్తారేమో ?. ఇప్పుడు బెయిల్ తెచ్చుకున్న ముగ్గురూ జగన్ కోసం లిక్కర్ స్కాం లావాదేవీలు చేశారు. కానీ జగన్ వారిని జైలులో పరామర్శించలేదు.