ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో ఇదో విచిత్ర‌మైన ప‌రిస్థితి.

`క‌ల్ట్‌` అనే మాట‌… `బేబీ` సినిమాతో పాపుల‌ర్ అయ్యింది. ఆ సినిమా నిర్మాత‌లు త‌మ త‌దుప‌రి చిత్రానికి `క‌ల్ట్` అనే టైటిల్ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే.. అప్ప‌టికే విశ్వ‌క్‌సేన్ `క‌ల్ట్` అనే సినిమా ప్ర‌క‌టించేశాడు. తాజుద్దీన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. విశ్వ‌క్‌సేన్ ముందుగానే ఈ టైటిల్ రిజిస్ట‌ర్ చేయించేయ‌డంతో.. ఇప్పుడు ఆ టైటిల్ పై ఆయ‌న‌కే హ‌క్కు ఉంద‌నుకోవాలి.

అయితే… ఇప్పుడు `క‌ల్ట్ ల‌వ్ స్టోరీ` అనే పేరుతో మ‌రో సినిమా రూపుదిద్దుకొంటోంద‌ని స‌మాచారం. నీల్ ద‌ర్శ‌కుడు. స‌త్య‌నారాయ‌ణ మ‌ల్లిడి నిర్మాత‌. బ‌న్నీ, ఢీ లాంటి సూప‌ర్ హిట్స్ త‌ర‌వాత స‌త్య‌నారాయ‌ణ మ‌ల్లిడి తీస్తున్న సినిమా ఇది. ఈ టైటిల్ కూడా ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ అయిపోయింది. ఇప్ప‌టికైతే మూడు టైటిళ్ల‌పై మూడు సినిమాలూ సెట్స్‌పై ఉన్నాయి. కానీ.. ఇవి మూడూ ఒకేసారి విడుద‌లైతే ప‌రిస్థితి ఏమిటో అర్థం కావ‌డం లేదు. టైటిల్ విష‌యంలో ఛాంబ‌ర్‌లో పంచాయితీ న‌డ‌వ‌డం గ్యారెంటీ అనిపిస్తోంది. ఏం జ‌రుగుతోందో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆఫ్రికాకు పెద్దిరెడ్డి జంప్ – చెప్పకనే చెప్పారుగా !?

మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికాలో కాంట్రాక్టులు చేస్తున్నారట.. అందుకని ఇక్కడి తన వాహనాలన్నింటినీ ముంబై పోర్టు నుంచి ఆఫ్రికాకు ఎక్స్ పోర్టు చేసేస్తున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ చేయాలనుకుంటే... ఇక్కడి నుంచే ఎందుకు...

జగన్ కు విధించబోయే మొదటి శిక్ష ఇదేనా..?

ఏపీలో కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోన్న వేళ మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాసన సభాపతి చైర్ లో ఎవరిని కూర్చోబెట్టనున్నారు..? అనే దానిపై బిగ్ డిస్కషన్ కొనసాగుతోంది....

రూట్ మార్చిన అధికారులు – ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామం

ఏపీ రాజకీయాల్లోనే కాదు అధికార వర్గాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంకేతాలతో టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లేందుకు చాలామంది అధికారులు ప్రయత్నాలు చేస్తుండటం...

మంచు మ‌నోజ్‌… మోస్ట్ డేంజ‌రెస్

మంచు మ‌నోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మైంది. త‌ను వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో వెరైటీగా విల‌న్ పాత్ర‌ల‌పై మోజు పెంచుకొన్నాడు. త‌న‌కు అలాంటి అవ‌కాశాలు ఇప్పుడు బాగా వస్తున్నాయి. 'మిరాయ్‌'లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close