తుమ్మలతో పోలీస్తే కేసీఆర్‌ చాలా బెటర్ !

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు నోటిదూకుడు చాలా ఎక్కువ అని.. ఎంత మాట పడితే అంత మాట అనేస్తారని.. అవతలి వారు నొచ్చుకుంటారనే సానుభూతి కూడా ఆయనకు ఉండదని ఆయన ఉద్యమ ప్రసంగాలు విన్నవారు అంటూ ఉంటారు. ఆ సమయంలో కేసీఆర్‌ తన ఉద్యమ ప్రత్యర్థులు, ఆంధ్రా వాళ్లని మూకుమ్మడిగా మాటలతో చీల్చిచెండాడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ప్రస్తుత వాతావరణాన్ని గమనిస్తే.. ఆయన చాలా సౌమ్యుడిగా మారిపోయినట్లుంది. ప్రత్యేకించి గ్రేటర్‌ ఎన్నికల ప్రచార నేపథ్యంలో గమనిస్తే.. తెలుగుదేశం నుంచి తెరాసలోకి వలసవెళ్లిన సౌమ్యుడైన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్న మాటల్తో పోలిస్తే.. కేసీఆర్‌ చాలా సాత్వికుడిగా తెలుగుదేశం పట్ల సానుభూతి ఉన్న నాయకుడిలాగా కనిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

తాజాగా నాయకుల వ్యాఖ్యలను పోల్చిచూస్తే.. రెండు రోజుల కిందట చంద్రబాబు మీద విరుచుకుపడ్డ కేసీఆర్‌.. ఆయనకు ఇక్కడేం పని అని మాత్రమే ప్రశ్నించారు. చంద్రబాబు వెళ్లి తన రాష్ట్రాన్ని, తన అమరావతిని డెవలప్‌ చేసుకోవాలిగానీ ఇక్కడ ఉండి ఏం సాధిస్తారనేది ఆయన ప్రశ్న. ‘చంద్రబాబు ఇక్కడేం పని’ అన్న కేసీఆరే మెతగ్గా మాట్లాడినట్లు లెక్క. తెదేపానుంచి తెరాసలోకి వెళ్లిన ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం.. అసలు తెలుగుదేశానికి ఇక్కడేం పని అంటూ ఏకంగా పార్టీ మొత్తాన్ని తరిమికొట్టే ఆలోచన చేస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్రంలోనే ఉండాలి.. మరో రాష్ట్రంలో రాజకీయం చేయలేదు. ఒక ఊరికి రాజు.. ఒక ఊరికి తలారి.. అని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. తుమ్మల నాగేశ్వరరావు.. ఏకంగా తెదేపా పార్టీ మొత్తాన్నీ తెలంగాణనుంచి తరిమికొట్టేలా మాట్లాడడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంటున్నది.

నిజానికి ప్రాంతీయ పార్టీ అంటే కేవలం ఒకే రాష్ట్రానికి పరిమితమైన పార్టీ అనేది నిర్వచనం ఎంత మాత్రమూ కాదు. ఒక భాషకు ఒక రాష్ట్రం అనే రాజ్యాంగబద్ధమైన ఏర్పాటుకే తూట్లు పడిపోయిన తర్వాత.. ఒక ప్రాంతీయ పార్టీ ఒకటికంటె ఎక్కువ రాష్ట్రాల్లో అస్తిత్వం కలిగి ఉండడం వింత కాదు. ఇలాంటి హక్కు తమకు ఉన్నప్పటికీ.. తెలుగుదేశం ఎందుకైనా మంచిదన్నట్లుగా జాతీయ పార్టీగా ప్రకటించుకుంది. అయినా సరే.. తుమ్మల మాత్రం దాన్ని ఇప్పటికీ.. ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తూ.. మొత్తంగా ఏపీకి తరలిపోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పట్ల ఈ ఇద్దరు నేతల స్పందనల్ని గమనిస్తే.. తుమ్మలకంటె కేసీఆర్‌ చాలా మెతకగా ఆడిపోసుకుంటున్నారని అనిపిస్తోంది మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close