ఆన్ లైన్ టికెట్ల గొడ‌వ‌: ఏపీ ప్ర‌భుత్వానికి కోర్టు నోటీసులు

ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ వ్య‌వ‌హారం మ‌రోసారి కోర్టు మెట్లెక్కింది. సినిమా టికెట్ల‌ను ఆన్ లైన్ ద్వారానే విక్ర‌యించాలంటూ కొత్త నిబంధ‌న చేరుస్తూ ఏపీ ప్ర‌భుత్వం గ‌తంలో ఓ జీవో జారీ చేసింది. ఈ జీవోని ఎట్టిప‌రిస్థితుల్లోనూ అమలు చేయాల‌న్న ఉద్దేశంతో థియేట‌ర్ య‌జ‌మానుల‌పై ఒత్తిడి తీసుకొస్తోంది. సంత‌కాలు చేయ‌డానికి నిరాక‌రించినందుకు ఏపీలోని చిలుకూరు పేట‌లో 5 థియేట‌ర్ల‌కు అధికారులు సీలు వేశారు. తాజాగా ఈ జీవోని స‌వాల్ చేస్తూ హైకోర్టులో మ‌రో వాజ్యం దాఖ‌లైంది. ఈ వ్య‌వ‌హారంపై బిగ్ బి ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ హై కోర్టుని ఆశ్ర‌యించింది.

మంగ‌ళ‌వారం ఈ వాజ్యంపై వియార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం ప్ర‌తివాదులుగా ఉన్న న్యాయ‌, శాస‌న‌శాఖ కార్య‌ద‌ర్శి, ఏపీ స్టేట్ ఫిల్మ్‌, టెలివిజ‌న్‌, థియేట‌ర్ డ‌వ‌లెప్మెంట్ కార్పొరేష‌న్ ల‌తో పాటుగా ఏపీ టెక్నాల‌జీ స‌ర్వీసెస్ లిమిటెడ్‌ల‌కు నోటీసులు జారీ చేసింది. వెంట‌నే దీనిపై కౌంట‌రు దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఇదే వ్య‌వ‌హారంపై మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల యాజ‌మాన్యాలు గ‌తంలో దాఖ‌లు చేసిన వాజ్యంతో క‌లిపి ప్ర‌స్తుత వాజ్యాన్ని విచారి్తామ‌ని పేర్కొంది. త‌దుప‌రి విచార‌ణ‌కు ఈనెల 27కు వాయిదా వేసింది. ఆరోజున విచార‌ణ‌లో ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవోపై మ‌ధ్యంత‌ర ఉత్వ‌ర్వులు జారీ చేసే అంశాన్ని ప‌రీశీలిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close