హైదరాబాద్ పోయినా కొండంత అండైన వెంకన్న

  • ఎపి భుజం కాస్తున్న టెంపుల్ టూరిజం
  • విశాఖపైనే పెద్ద ఆశలు
  • పర్యాటకుల సంఖ్య ఎంత ఎక్కువగా వుంటే సంబంధిత సర్వీసు రంగాలు అంత హెచ్చుగా విస్తరిస్తాయి. యాక్టివిటీ పెరిగి ఉపాధి లేదా ఆదాయ మార్గాలు స్ధిరపడతాయి. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కు కాకుండా పోయాక ఆ లోటుని తిరుపతి వెంకన్న బర్తీ చేస్తున్నాడు. ఆలయాలకు పేరుపడిన తూర్పుగోదావరితో కలిపిచూస్తే టెంపుల్ టూరిజమే ఎపి భుజంకాస్తున్నట్టు కనిపిస్తోంది.

    హెచ్చుసంఖ్యలో టూరిజం స్పాట్లు వున్న ఆంధ్రప్రదేశ్ లో యాత్రీకులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయగలిగితే పర్యాటక రంగమే పెద్ద ఉపాధి కల్పనా వేదిక కాగల అవకాశాలు వున్నాయి.

    విభజన తరవాత ఎపిలో టూరిజం వసతులు పెద్దగా విస్తరించకపోయినా పర్యాటకుల సంఖ్యపెరుగుతూనే వుంది. సమాచార పౌర సంబంధాల శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం ఎపి లోని 13 జిల్లాల్లో 2014 లో 9 కోట్ల 33 లక్షల మంది పర్యటించారు వీరిలో 66 వేల మంది విదేశీయులు వున్నారు. 2015 లో 12 కోట్ల 18 లక్షల మంది పర్యటించగా వారిలో విదేశీయుల సంఖ్య లక్ష కంటే ఎక్కువగా వుంది. విభజన అనంతరం స్వస్ధలాన్ని చూడటానికి వచ్చిన ప్రవాసాంధ్రులు, గోదావరి పుష్కరాలు ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.

    ఈ సంవత్సరం ఇప్పటికే ఎపికి 8 కోట్లమంది పర్యాటకులు వచ్చారు. లక్షా పాతికవేల మంది విదేశీయులు వున్నారు.

    విదేశీ పెట్టుబడులు, రాజధాని నిర్మాణానికి భారీ సన్నాహాలు…ఎపి కి గతరెండేళ్ళుగా విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం.

    తిరుమలేశుడు కొలువైవున్న చిత్తూరు జిల్లాలో ఎంత తక్కువ చూసినా ఏటా మూడున్నర కోట్ల మందికంటే హెచ్చు మందే పర్యటిస్తారు. తరువాత స్ధానం చదరపు కిలోమీటరుకి ఒకటి కంటే ఎక్కువ గుడులు వున్న తూర్పుగోదావరి జిల్లాదే! రాజమహేంద్రవరం కేంద్రంగా ఈ జిల్లాలో పర్యటించేవారి సంఖ్య ఏటా కోటిమందికి తగ్గడం లేదు. అయితే, ఈ మేరకు సదుపాయాలు మాత్రం పెరగడంలేదు.

    తిరుమల-తిరుపతి గత ఏడాది నాలుగు కోట్ల మంది భక్తులు సందర్శించగా… ఈ ఏడాది జులై నాటికి ఆ సంఖ్య 2 కోట్ల 36 లక్షలకు పైనే ఉంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగాతిరుపతి విరాజిల్లుతుంటే… ఆంధ్రప్రదేశ్ లో పెద్దనగరమైన విశాఖపట్టణం పర్యాటకరంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. హూదూద్ తుపాన్ తర్వాత కోలుకున్న విశాఖ పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆహ్వానం పలుకుతోంది. 2014లో 63 లక్షల మంది పర్యాటకులు విశాఖను సందర్శించగా… 2015లో ఆ సంఖ్య కోటీ 15 లక్షలపైగా ఉంది. అదే 2016లో ఆ సంఖ్య జులై చివరి నాటికి కోటీ 11 లక్షల దాటడం విశేషం.

    రాష్ట్ర ప్రభుత్వం విశాఖను పారిశ్రామికంగా, టూరిజం హాట్ స్పాట్ గా, ఎడ్యుకేషన్ హబ్, ఉద్యోగ అవకాశాల కల్పనకు కేంద్రంగా తీర్చిదిద్దడంతో, దసరా ఉత్సవాలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి పర్యాటకులు విశాఖ తరలివస్తున్నారు.

    రాష్ట్ర విభజన తర్వాత టూరిజాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు ఎపి ప్రభుత్వం టూరిజమ్ మిషన్ 2014, టూరిజం పాలసీ 2015తో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పర్యాటక రంగాన్ని విస్తృతపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో టూరిజం వృద్ధికి ఉన్న అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకొని పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర ప్రగతిని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.

    Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

    Most Popular

    బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

    బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

    నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

    రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

    కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

    కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

    పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

    ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

    HOT NEWS

    css.php
    [X] Close
    [X] Close