విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రేపు విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు విజ‌య్ – దిల్ రాజు బ్యానర్‌లో తెర‌కెక్క‌బోయే సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ కూడా రేపే రానుంది. ‘రాజావారు రాణీవారు’ ఫేమ్ ర‌వికిర‌ణ్ కోలా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి ‘రౌడీ జ‌నార్థ‌న్‌’ పేరు పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. అయితే ఇది కేవ‌లం వ‌ర్కింగ్ టైటిల్ మాత్ర‌మే అని, మ‌రో కొత్త టైటిల్ ఈ సినిమాకు పెట్ట‌బోతున్నార‌ని టాక్‌.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంలో షూటింగ్ జ‌రుగుతోంది. విజ‌య్ కూడా అక్క‌డే ఉన్నాడు. గురువారం కూడా విజ‌య్ సెట్లోనే ఉంటాడు. పుట్టిన రోజు సెల‌బ్రేష‌న్స్ కూడా అక్క‌డే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ఒక‌టి రెడీ అయ్యింది. రేపే ఈ పోస్ట‌ర్ ని విడుద‌ల చేస్తారు. అయితే మూడు సినిమాల టైటిల్స్ స‌స్పెన్స్ లో ఉన్నాయి. ఏ టైటిల్ నీ ఇప్పుడు రివీల్ చేయ‌డం లేదు. రాహుల్ సంకృత్య‌న్ సినిమా సెప్టెంబ‌రులో మొద‌ల‌వుతుంది. కాబ‌ట్టి.. టైటిల్ రివీల్ చేయ‌డానికి టైమ్ ఉంది. దిల్ రాజు సినిమా కూడా వ‌చ్చే యేడాది వ‌ర‌కూ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ లేదు. కాబ‌ట్టి టైటిల్ ఇప్పుడే చెప్ప‌లేరు. గౌత‌మ్ సినిమా కొంత‌మేర షూట్ అయ్యింది. కాక‌పోతే.. టైటిల్ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. ఇంకా ఫైన‌ల్ కాలేదు. అందుకే ఆ టైటిల్ కూడా పెండింగ్ లో పెట్టేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close