రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే..! నేడు ఒకే వేదికపై రాహుల్ – చంద్రబాబు ..!!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. ఇది ఈ రోజు మరోసారి నిరూపితమవుతుంది. దశాబ్దాల పాటు.. వ్యతిరేక పార్టీలుగా మెలిగిన.. కాంగ్రెస్, టీడీపీ ల అధ్యక్షుడు.. ఒకే వేదికపై ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ ఉదయం కోడంగల్‌లో ఎన్నికల బహిరంగసభలో ప్రసంగించి.. మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం గొల్లగూడం చేరుకుంటారు. ఖమ్మంలోని ఎస్పీ స్టేడియంలో ప్రజా కూటమి బహిరంగసభలో పాల్గొంటారు. ఈ మీటింగ‌్లోనే రాహుల్‌తో కలిసి.. ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇదే వేదికపై ఈ ఇద్దరు నేతలు ప్రసంగిస్తారు. తర్వాత హైదరాబాద్‌లో సాయంత్రం 5.30 గంటలకు సనత్‌నగర్ సత్యం థియేటర్ బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నాంపల్లి నియోజకవర్గం అసిఫ్ నగర్‌లో చంద్రబాబు, రాహుల్ రోడ్ షో నిర్వహిస్తారు.

తెలంగాణలో రెండో రోజు కూడా రాహుల్ పర్యటన కొనసాగనుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం భూపాలపల్లి బహిరంగ సభలో… సాయంత్రం 5 గంటలకు పరిగి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం చెవెళ్లలో ప్రచారం చేసి ఢిల్లీ వెళ్తారు. గురువారం కూడా చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలలో చంద్రబాబు రోడ్ షోలు నిర్వహిస్తారు.

పోలింగ్ తేదీ సమీపించడంతో కీలక నేతలు రంగంలోకి దిగడంతో సీన్ మారుతుందని ప్రజాకూటమి నేతలు బావిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, రాహుల్ గాంధీ సభలు ప్రజాకూటమికి ఉత్సాహం ఇవ్వనున్నాయి. ప్రచార తేదీలు దగ్గర పడే సమయంలో.. మరోసారి. .ఇద్దరూ కలిసి ప్రచారం చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close