ఇవాళ్టి రచ్చ ఇదేనా: మూజువాణీనా? డివిజనా?

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు బుధవారం నాడు ముగియనున్నాయి. ఫైనాన్స్‌ బిల్లుకు బుధవారం నాడు సభలో ఓటింగ్‌ జరుగుతుంది. అయితే ఫైనాన్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించడం, ఆ మేరకు తమ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులందరికీ కూడా విప్‌ జారీ చేయడం ఇప్పటికే పూర్తయింది. పైగా ఫైనాన్స్‌ బిల్లు మీద ఓటింగ్‌ను డివిజన్‌ పద్ధతి ద్వారా మాత్రమే చేపట్టాలంటూ విపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ స్పీకరుకు ఒక వినతిపత్రాన్ని నాలుగురోజుల కిందటే సమర్పించుకుంది. సాధారణంగా మూజువాణీ పద్ధతిలోనే ఫైనాన్స్‌ బిల్లును ఆమోదించేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో.. బుధవారం నాటి సభా వ్యవహారాలు కూడా రచ్చరచ్చగానే సాగే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.

తమ పార్టీ గుర్తు మీద గెలిచి, అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయిన ఎమ్మెల్యేల మీద వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉడికిపోతూ ఉండడం చాలా సహజం. అందుకే పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడడానికే తనకు ఇష్టం లేదని పబ్లిక్‌ మీటింగుల్లో అంటూ.. వారి మీద వేటు వేయించడానికి ఆయన నానామార్గాలను అనుసరిస్తున్నారు. అక్కడికే ఆయన ఈగో దెబ్బ తింటున్నదని అనుకుంటోంటే… బడ్జెట్‌ సమావేశాలు మొదలైన తర్వాత మరో రెండు వికెట్లు కూడా పడ్డాయి. పార్టీ తరఫున చంద్రబాబు సర్కారు మీద దాడి చేయడంలో సదా ముందంజలో ఉంటూ.. ఒక దశలో క్రమశిక్షణ వేటుకు కూడా దగ్గరైన జ్యోతుల నెహ్రూ వంటి కీలక నాయకుడు కూడా వైకాపాను వీడి తెదేపాలో చేరడానికి నిర్ణయించుకోవడం ఆయనకు కచ్చితంగా షాక్‌ అయ్యే ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరందరికీ చెక్‌పెట్టేలా.. వైకాపా విప్‌ జారీ చేసింది.

మంగళ, బుధవారాల్లో విధిగా అసెంబ్లీకి రావడమూ, ఫైనాన్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడమూ విప్‌లోని అంశాలు. అయితే ఈ విప్‌ను ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయంలో తమ పార్టీ ఛానల్‌ ద్వారా వీడియో తీయించుకుని… ఆ తర్వాత వారిని లీగల్‌గా ఇరికించవచ్చునని జగన్‌ అండ్‌ కో ప్లాన్‌ చేయడం కూడా మధ్యలో రచ్చగా మారింది. జలీల్‌ఖాన్‌ కు విప్‌ ఇస్తూ వీడియో తీయడం, గొడవగా మారింది.

అదంతా పక్కన పెడితే.. అసలు విప్‌ను పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు ఖాతరు చేస్తారా లేదా? అనేది ఇప్పుడు కీలకం. ఫైనాన్స్‌ బిల్లు ఆమోదం విషయంలో డివిజన్‌ పద్ధతిని అనుసరిస్తే తప్ప విప్‌కు విలువ ఉండదు. అయితే ఏ పద్ధతిలో దీన్ని ముగించాలనేది స్పీకరు విచక్షణాధికారాలకు లోబడి ఉంటుంది. ఆయన మూజువాణీ ఓటు ద్వారా ముగించాలనుకుంటే.. జగన్‌కు షాక్‌ ఇచ్చినట్లే.

ఆ నేపథ్యంలోనే ఇవాళ్టి సభలో చివరిసారిగా రగడ చేయడానికి… జగన్‌ పార్టీకి ఈ ఓటింగ్‌ వ్యవహారమే ఒక పెద్ద అవకాశంగా కనిపిస్తున్నది. వారు డివిజన్‌కోసం పట్టుపట్టడం, స్పీకరు నిర్ణయం తద్విరుద్ధంగా ఉంటే గనుక.. అంతా రచ్చరచ్చ అవుతుంది. డివిజన్‌ ప్రకారం ఓటింగ్‌ జరిగి, వైకాపా ఫిరాయింపు ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించినా కూడా.. వారి మీద వేటు పడడం అనేది అంత సులువుగా, వెంటనే కార్యరూపం దాల్చగల వ్యవహారం ఎంతమాత్రమూ కాదు. కాకపోతే.. ఫిర్యాదు చేయడానికి వైకాపాకు ఒక అదనపు పాయింటు జతచేరినట్లు అవుతుంది. కానీ వైకాపా దీన్ని చేజార్చుకోదు గనుక.. సభలో చివరిరోజైన బుధవారం రచ్చ తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close