ద‌స‌రాకీ చెల్లు చీటీ!

సినిమా క‌ష్టాలు ఇప్ప‌ట్లో తీరేలా లేవు. అన్ లాక్ 3లోనైనా.. థియేట‌ర్లకు మోక్షం ల‌భిస్తుంద‌నుకుంటే.. ఆ ఆశ‌ల‌కూ, అంచ‌నాల‌కూ కేంద్ర ప్ర‌భుత్వం క‌ళ్లెం వేసింది. థియేట‌ర్ల అనుమ‌తికి స‌సేమీరా అన‌డంతో – నిర్మాత‌లు ప్ర‌ణాళిక‌ల‌న్నీ మ‌ళ్లీ త‌ల్ల‌క్రిందుల‌య్యాయి. ఆగ‌స్టు నుంచి థియేట‌ర్లు తెరిస్తే – ద‌స‌రా నాటికి ప‌రిస్థితి స‌ర్దుకుని, కొత్త సినిమాల‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌తాయ‌ని చిత్ర‌సీమ భావించింది. ఇప్ప‌టికే రెడీగా ఉన్న కొన్ని సినిమాల్ని ద‌స‌రా బ‌రిలో నిల‌పాల‌నుకున్నది. అయితే.. ప్ర‌స్తుతం ఆ సూచ‌న‌లేం క‌నిపించ‌డం లేదు. థియేట‌ర్ల‌కు అన్ లాక్ 3లోనూ ప‌ర్మిష‌న్లు రాక‌పోవ‌డంతో.. అన్ లాక్ 4 కోసం వేచి చూడ‌డం త‌ప్ప‌.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చేయ‌గ‌లిగిందేం లేదు.

సెప్టెంబ‌రులో థియేట‌ర్ల అనుమ‌తి ల‌భించింద‌నుకుందాం. అప్ప‌టిక‌ప్పుడు సినిమాల్ని విడుద‌ల చేయ‌డం చాలా క‌ష్టం. ముందు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలి, థియేట‌ర్ సిట్టింగ్ సిస్ట‌మ్ మార్చుకోవాలి, టికెట్ల విక్ర‌యం పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జ‌రిగే ఏర్పాట్లు చేసుకోవాలి.. ఇలా చాలా త‌తంగ‌మే ఉంది. పైగా.. పెద్ద సినిమాలేవీ, విడుద‌ల‌కు రెడీ కాక‌పోవొచ్చు. ముందు చిన్న సినిమాలు వ‌దిలి, ప‌రిస్థితి గ‌మ‌నించే అవ‌కాశం ఉంది. సెప్టెంబ‌రు లో థియేట‌ర్ల‌కు ప‌ర్మిష‌న్లు ఇస్తార‌న్న గ్యారెంటీ ఇప్ప‌టికీ లేదు. దానికి కార‌ణం.. సినిమాలు, థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌ని చిట్ట చివ‌రి ప్ర‌ధాన్య‌త‌ల లిస్టులో పెట్టింది కేంద్రం. స్కూల్లూ, కాలేజీలూ తెరిచిన త‌ర‌వాతే.. థియేట‌ర్ల గురించి ఆలోచిస్తారు. ప్ర‌స్తుతం స్కూలు, కాలేజీలే తెరిచే అవ‌కాశం లేదు. పైగా మాస్ గేద‌రింగ్ థియేట‌ర్ల‌లో ఎక్కువ‌. టికెట్ కౌంట‌ర్లు, క్యూలూ, ఫుడ్ కాంప్లెక్స్‌ల ద‌గ్గ‌ర వాళ్ల‌ని అదుపు చేయ‌డం క‌ష్టం. అందుకే.. థియేట‌ర్ల గురించి కేంద్రం అస‌లు ఏమాత్రం ఆలోచించ‌డం లేదు. ఎలా చూసినా.. ద‌స‌రానే కాదు, 2020 మొత్తం థియేట‌ర్ల‌కు తాళాలు వేసే అవ‌కాశాలే ఎక్కువ‌. 2020 గురించి మ‌ర్చిపోయి 2021 సంక్రాంతి గురించి ప్లాన్ చేసుకోవ‌డం త‌ప్ప ఇప్పుడు చేయ‌గ‌లిగిందేం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close