డ్రగ్స్ అంటే తెలియని టాలీవుడ్ తారలు..! ఇదిగో క్లీన్ చిట్..!

తెలుగు సినిమా వాళ్లంతా స్వచ్చమైన వారు. వారికి డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లు అసలు లేవు. ఉన్నాయేమో అని గతంలో సీరియల్‌గా రోజుకొకరిని చొప్పున పిలిచి.. గోళ్లు, వెంట్రుకలు తీసుకుని టెస్టులు చేయించిన తెలంగాణ అధికారులకు ఈ నిజం తెలిసిపోయింది. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ పోలీసులు ఈ నిజాన్ని కోర్టుకు తెలిపారు. డ్రగ్స్ కేసులో వీరు వేసిన చార్జిషీట్‌ను న్యాయస్థానం ఆమోదించింది. డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానంతో గతంలో విచారించి 11 మంది సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్ ఇచ్చారు.

ప్రముఖ హీరో రవితేజ సోదరుడు శంషాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ సమయంలో ఆయనకు సంబంధించిన ఫోన్ పోలీసులకు లభించింది. ఆ ఫోన్‌ను విశ్లేషిస్తే.. టాలీవుడ్‌లో డ్రగ్స్ దందా మొత్తం బయటపడిందని ప్రచారం జరిగింది. 2017 జులై 2న 12 డ్రగ్స్‌ కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్ట్‌ చేసి 27 మందిని ప్రశ్నించారు. తొలుత 8 కేసుల్లో మాత్రమే చార్జిషీట్ ఫైల్ చేశారు. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో మరో 4 చార్జిషీట్లు దాఖలు చేశారు. ఆ ఫోన్‌లో దొరికిన సమాచారమో… మరెక్కడి నుంచి అయినా లభించిందో కానీ పెద్ద ఎత్తున తర్వాత రెయిడింగ్‌లు చేసి.. డ్రగ్ పెడలర్లను పట్టుకున్నారు. టాలీవుడ్‌ ప్రముఖుల్ని పిలిపించి ప్రశ్నించారు. వారి శాంపిళ్లను తీసుకున్నారు.

అప్పట్లో టాలీవుడ్ .. ఏపీ ప్రభుత్వ పెద్దలతోనే సన్నిహితంగా ఉన్నారన్న విమర్శలు .. టీఆర్ఎస్ వైపు నుంచి వచ్చేవి. ఈ వివాదం తర్వాత టాలీవుడ్ మొత్తం.. టీఆర్ఎస్ అధికార పార్టీతో సన్నిహితమయింది. దాంతో కేసులో తీవ్రత తగ్గిపోతూ వచ్చింది. చివరికి సినీ తారలపై మరకపడకుండా.. టాలీవుడ్ పెద్దలు కవర్ చేసుకోగలిగారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు సరిగ్గా విచారణ చేయడం లేదని.. కేసును.. ఈడీకి అప్పగించాలని… ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ న్యాయపోరాటం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజాపోరుపై ఏపీ బీజేపీ ఆశలు !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉనికిచాటుకునేందుకు ఇప్పుడు హడావుడిగా ప్రయత్నిస్తోంది. ప్రజాపోరు సభలతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు పెట్టుకుని గట్టిగానే బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి ఊరిలో ముఖ్య కూడలిలో ఓ సభ ఏర్పాటు...

ఏపీసీఐడీ కోర్టుకు దొరికిపోయినట్లే – బలి చేసేదెవరిని ?

ఏపీసీఐడీకి కోర్టు జారీ చేసిన షోకాజ్ నోటీసులు ఇప్పుడు పోలీసు వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. జర్నలిస్ట్ అంకబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా కోర్టులో పచ్చి అబద్దాలు ఆడారు. ఇప్పుడు న్యాయస్థానం వాటికి...

ఏపీలో ప్రభుత్వం మారుతుందని షర్మిల నమ్మకం !

ఏపీలో ముఫ్పైఏళ్లు మాదే అధికారం . మేం ఏం చేసినా తిరుగులేదు అనే ఉద్దేశంతోనే వైసీపీ అధినేత విచ్చలవిడి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు వైసీపీ క్యాడర్‌లో ఉంది. ప్రజాస్వామ్యంలో శాశ్వతం...

రివ్యూ: అల్లూరి

Alluri Movie Telugu Review పోలీస్ క‌థ‌ల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ఆ క్యారెక్ట‌ర్‌కి జ‌నం క‌నెక్ట్ అయితే.. తెర‌పై ఏం చెప్పినా వింటారు. ఏం చూపించినా చూస్తారు. రొటీన్ క‌థ‌ల‌తో సైతం.. మెస్మ‌రైజ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close