టాలీవుడ్‌ డ్రగ్స్ కేసుల్లో చార్జిషీట్లు ఇంకా వేయలేదు..!

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా ఎలా ఉంటుందో గతంలో చాలా సార్లు బయటపడింది. ప్రస్తుతం బాలీవుడ్, శాండల్ వుడ్‌లలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. అది ఇంకా టాలీవుడ్ వరకూ రాలేదు. కానీ గతంలో కేసులు మాత్రం చర్చకు వస్తున్నాయి. ఆ కేసులన్నీ ఏమైపోయాయనే అంశంపై… ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అనే సంస్థ వివరాలు బయటకు లాగాలని ప్రయత్నించింది. సమాచార రక్కు చట్టం కింద… ఎక్సైజ్‌శాఖకి దరఖాస్తు చేసింది. సమాచారం అయితే పంపింది.. కీలక విషయాలు కూడా బయటపెట్టింది… కానీ టాలీవుడ్‌కి సంబంధించిన చిన్న విషయం కూడా చెప్పలేదు. గతంలో జరిగిన విషయాన్ని కూడా చెప్పలేదు. హైదరాబాద్‌లో గత రెండేళ్లలో 12 డ్రగ్స్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించిన ఎక్సైజ్‌శాఖ.. ఇప్పటి వరకూ 8 కేసుల్లో చార్జిషీట్‌ వేసినట్లుగా ప్రకటించింది.

చార్జిషీట్లు వేయని నాలుగు కేసులు టాలీవుడ్‌కు సంబంధం ఉన్నవే. అయితే… ఎక్సైజ్‌శాఖ దాఖలు చేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు ఉన్నాయి. డ్రగ్స్ వాడకం దారులు.. పెడ్లర్స్.. జర్మనీ, బ్రిటన్‌, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకుంటున్నారని… ఎక్సైజ్ శాఖ తెలిపింది. విదేశాల నుంచి స్టీల్‌బౌల్స్‌ పేరుతో కొకైన్‌, ఎల్‌ఎస్‌డీని ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకుటున్నారన్నారు. ఎక్సైజ్ శాఖ ఇప్పటి వరకూ దాఖలుచేసిన 8 చార్జిషీట్లలో కళాశాల విద్యార్థులతో పాటు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ కేసులో 72 మంది పేర్లు ఉన్నాయని.. విచారణకు హాజరైన 12 మందితో పాటు మరో 60మందితో జాబితా ఉందని ఎక్సైజ్ శాఖ తెలిపింది.

వారి పేర్లు మాత్రం బయట పెట్టలేదు. రవితేజ సోదరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు లభించిన ఫోన్ లో దొరికిన సమాచారం ఆధారంగా.. కొంత మంది డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో టాలీవుడ్ డ్రగ్స్ డొంక కదిలిందనుకున్నారు. కానీ తర్వాత సైలెంటయిపోయారు. ఆ సైలెన్స్ ను ఇంకా కొనసాగిస్తున్నారని.. తాజాగా ఎక్సైజ్ శాఖ ఆర్టీఐ కి ఇచ్చిన రిప్లయ్ ద్వారా తేలిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనూ రేటు: రోజుకి 20 ల‌క్ష‌లు

ఈ కరోనా స‌మ‌యంలో.. సోనూసూద్ రియ‌ల్ హీరో అయిపోయాడు. హీరోల‌కూ, రాజ‌కీయ నాయ‌కుల‌కు, ప్ర‌భుత్వాల‌కు, సంస్థ‌ల‌కు ధీటుగా - సేవ‌లు అందించాడు. త‌న యావ‌దాస్తినీ దాన ధ‌ర్మాల‌కు ఖ‌ర్చు పెట్టేస్తున్నాడా? అనేంత‌గా...

స‌ర్కారు వారి పాట అప్ డేట్: మ‌హేష్ ముందే వెళ్లిపోతున్నాడు

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా `సర్కారువారి పాట‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 4 నుంచి అమెరికాలో షూటింగ్ ప్రారంభం కానుంది. వీసా వ్య‌వ‌హారాల‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. అయితే చిత్ర‌బృందం కంటే ముందే.. మ‌హేష్...

ఏపీ విద్యార్థుల్ని కూడా పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తున్నారా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో అక్కడి ప్రజలకు అర్థమవడం లేదు. బస్సుల నుంచి మద్యం వరకూ ..ఉద్యోగాల నుంచి చదువుల వరకూ అన్నింటిపైనా పొరుగు రాష్ట్రాలపైనే ఏపీ ప్రజలు ఆధారపడేలా విధానాలు...

“పోస్కో” చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రెండు రోజుల కిందట... పోస్కో అనే స్టీల్ ఉత్పత్తిలో దిగ్గజం లాంటి పరిశ్రమ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్...

HOT NEWS

[X] Close
[X] Close