ఓ శుక్ర‌వార‌మా… ఎప్పుడొస్తావ్?

గుళ్లో గంట‌లా..
పూజ గ‌దిలో గుభాళించే క‌ర్పూరంలా..
తెలుగింటి ముత్తైదువ‌లా
మ‌సీదులోంచి వ‌చ్చే దువాలా
క్రైస్త‌వుడి దీవెన‌లా
ఎంత ప‌విత్రంగా క‌నిపించేదో!

ఇక సినిమా వాడికా..
ఆరోజు పండ‌గే!

నిద్ర మొహంతోనే `సినిమా టాకేంటో`
అని సెల్‌ఫోనుల్లో దూరి
లైవ్ అప్ డేట్ల‌కోసం వెదికే
ఆ శుక్ర‌వారం ఎప్పుడొస్తుందో..?

హిట్టు
సూప‌ర్ హిట్టు
బ్లాక్ బ్ల‌స్ట‌రు… ఈ మాట‌లెప్పుడు
వినిపిస్తుందో…?

మామా.. మాట్నీకెళ్దాం వ‌స్తావా,
ఓ టికెట్టు కావాల్రా..
రివ్యూ ఏంటి? రేటింగెంత‌?
రికార్డు బ్రేకేనా..
– ఇలా ఎప్పుడు మాట్లాడుకుంటామో..?

గ‌ర్వాన్ని నేల‌కు దించేదానివి
ప్ర‌తిభ‌కు రెడ్ కార్పేట్ ప‌రిచేదానివి!
అనూహ్యాలూ
ఆశ్చ‌ర్యాలూ
హ‌హాకారాలూ
అద్భుతాలూ..
నీలో ఎన్ని కోణాలుండేవో..?

థియేట‌ర్ ముందు క్యూలో నిల‌బ‌డ‌డం
టికెట్టు కోసం క‌ల‌బ‌డ‌డం
చివ‌రికి అది ద‌క్కితే.. విజ‌య‌గ‌ర్వంతో
ప్ర‌పంచాన్ని గెలిచినంత సంబ‌రంతో
కాల‌ర్ ఎగ‌రేయ‌డం..
మళ్లీ ఈ రోజు ఎప్పుడు చూస్తామో..?
ఓ శుక్ర‌వార‌మా.. నువ్వెప్పుడొస్తావ్‌???

ఓ శుక్ర‌వార‌మా?
ఒక్క రోజులోనే ఎన్ని జీవితాలు మ‌లుపు తిప్పేదానివో?
ఎన్ని క‌ల‌ల‌కు పిల్ల‌ల్నిక‌నేదానివో..?
ఎన్ని ఆశ‌ల‌కు చిగుర్లు తొడిగే దానివో..?
ఎన్ని క‌థ‌ల‌కు రెక్క‌లిచ్చేదానివో..?
మ‌ళ్లీ.. నువ్వెప్పుడొస్తావ్‌?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close