గెట్ రెడీ: షూటింగుల‌కు స‌ర్వం సిద్ధం

టాలీవుడ్ లో మ‌ళ్లీ `స్టార్‌.. కెమెరా.. యాక్ష‌న్‌` అనే మాట‌లు విన‌ప‌డ‌బోతున్నాయి. సెట్లు మ‌ళ్లీ క‌ళ‌క‌ళ‌లాడ‌బోతున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం కాస్త కాస్త త‌గ్గుతున్న వేళ‌, లాక్ డౌన్ నీడ‌లు మెల్ల‌మెల్ల‌గా తొల‌గిపోతున్న వేళ‌… షూటింగుల‌కు మ‌ళ్లీ రెడీ అవ్వ‌బోతోంది టాలీవుడ్. జూలై నుంచి షూటింగులు మొద‌ల‌వుత‌తాయ‌ని భావించారంతా. అయితే.. అంత‌కు ముందుగానే ఆ హ‌డావుడి క‌నిపించ‌బోతోంది. ఈనెల‌లోనే కొన్ని ప్ర‌ధాన‌మైన సినిమాలు సెట్స్‌లోకి వెళ్ల‌డానికి రెడీ అయ్యాయి. దాంతో.. టాలీవుడ్ లో కాస్త సంద‌డి క‌నిపించ‌బోతోంది.

నాగ‌చైత‌న్య సినిమా `థ్యాంక్యూ` ఈనెల 21న కొత్త షెడ్యూల్ మొద‌లెట్టుకోనుంది. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లున్న సంగ‌తి తెలిసిందే. ఈ యేడాది చివ‌ర్న గానీ, సంక్రాంతికి గానీ, ఈ చిత్రం విడుద‌ల‌య్యే ఛాన్సుంది. గుణ‌శేఖ‌ర్ – స‌మంత‌ల `శాకుంత‌ల‌మ్‌` కూడా ఈనెల‌లోనే మొద‌లుకానుంది. ఈనెల 24న ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. అందుకోసం హైద‌రాబాద్ లో భారీ సెట్ ని కూడా తీర్చిదిద్దారు. ర‌వితేజ ఖిలాడీకి ఈనెల 26న క్లాప్ కొట్ట‌బోతున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్త‌వుతుంది. జులై 1న ఎఫ్ 3, `ఆర్‌.ఆర్‌.ఆర్‌`… రెండూ సెట్స్‌పైకి వెళ్ల‌నున్నారు. అఖండ‌, ఆచార్య‌లు కూడా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి స‌మాయాత్తం అవుతున్నాయి. జులై మొద‌టి వారానికి… పెద్ద సినిమాలన్నీ షూటింగులు ప్రారంభించుకోవ‌డానికి రెడీ అవుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ తెలంగాణలో డ్రగ్స్ కేసుల కలకలం !

హైదరాబాద్, సైబరాబాద్‌కు ఇప్పుడు ఉన్న కమిషనర్ల నేరస్తును ఓ ఆట ఆడిస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సైబర్ ఫ్రాడ్‌ల మీద దృష్టి పెడితే.. హైదరాబాద్ కమిషన్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసుల్ని వెలికి తీస్తున్నారు....

ఎన్నికల జిమ్మిక్ అనుకున్నా సరే.. ప్రధాని స్టైల్ అదే !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిపబ్లిక్ డే వేడుకల్లో భిన్నంగా కనిపించారు. భగత్ సింగ్ తరహా టోపీ..  ఓ విభిన్నమైన కండువాతో వేడుకల్లో పాల్గొన్నారు. టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉంది. కాసేపటికే నెటిజన్లు అవి ఎక్కడివో...

అదే నరసింహన్ గవర్నర్ అయితే ఇలా జరిగేదా !?

రిపబ్లిక్ డే రోజున కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కారణం ఏమిటంటే రాజ్‌భవన్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుక.. జెండా పండుగకు కేసీఆర్ వెళ్లలేదు. కనీసం సీనియర్...

“కొత్త జిల్లాల పని” చేస్తామంటున్న ఉద్యోగ సంఘాలు !

ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాలు భిన్నంగా స్పందించాయి. ఐఏఎస్‌లు మినహా ఉద్యోగలంతా సమ్మెలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close