తెలంగాణ ప్ర‌భుత్వానికి టాలీవుడ్ విన్న‌పాలు

క‌రోనా మ‌హ‌మ్మారి వ్య‌వ‌స్థ మొత్తాన్ని అత‌లాకుత‌లం చేసింది. సినిమా ప‌రిశ్ర‌మ‌నైతే మ‌రీనూ. లాక్ డౌన్ స‌మ‌యాల్లో థియేట‌ర్లు మూత‌బ‌డ్డాయి. లాక్ డౌన్ ఎత్తేసినా – థియేట‌ర్ వ్య‌వ‌స్థ ఇంకా తేరుకోలేదు. కొన్ని థియేట‌ర్లు ఇప్ప‌టికే షాపింగ్ మాల్స్ లా మారిపోయాయి. అదే బాట‌లో ఇంకొన్ని థియేట‌ర్లూ చేర‌బోతున్నాయి. ఓటీటీల హ‌వాతో… ఈ వ్య‌వ‌స్థ మ‌రింత కృంగిపోయింది. ఇలాంటి క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌ని ఆదుకోవాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి తెలంగాణ ప్ర‌భుత్వానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ వేడుకుంటోంది. అందులో భాగంగా కొన్ని ప్ర‌తిపాద‌న‌ల్ని ప్ర‌భుత్వం ముందుంచింది.

అందులో భాగంగా.. జీవో నెం 75ని వెన‌క్కి తీసుకోవాల‌ని ఛాంబ‌ర్ కోరుతోంది. ఈ జీవో ప్ర‌కారం.. పార్కింగ్ ఛార్జిల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. థియేట‌ర్ల‌కు వెళ్లిన ప్రేక్ష‌కుల‌పై అద‌న‌పు భారాన్ని త‌గ్గించింది. అయితే పార్కింగ్ త‌మ ఆదాయ వ‌న‌రుల్లో ఒక‌ట‌ని, పార్కింగ్ ఛార్జిల‌ను ఎత్తేయ‌డం వ‌ల్ల‌.. థియేట‌ర్ ల‌కు రావాల్సిన ఆదాయం రాకుండా పోతుంద‌ని థియేట‌ర్ యజ‌మానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే థియేట‌ర్ వ్య‌వ‌స్థ మొత్తం అత‌లాకుత‌ల‌మైంద‌ని, పార్కింగ్ చార్జీల‌ను వ‌సూలు చేసుకునే అవ‌కాశాన్ని తిరిగి త‌మ‌కు క‌ల్పించాల‌ని కోరుతున్నారు. క‌రోనా స‌మ‌యంలో… థియేట‌ర్ల క‌రెంట్ ఛార్జీల‌ను మిన‌హాయించాల‌న్న‌ది మ‌రో ఆభ్య‌ర్థ‌న‌. ఏప్రిల్ నుంచి.. థియేట‌ర్లు మూసే ఉన్నాయి. అయితే ప్ర‌తీ నెలా.. క‌నీస క‌రెంట్ ఛార్జీ మాత్రం థియేట‌ర్లు క‌ట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. మూడు నెల‌ల క‌రెంట్ ఛార్జీలూ త‌డిసి మోపెడు అవుతున్నందున‌.. వాటి నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుతున్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో.. ప్రాప‌ర్టీ టాక్స్ నుంచి కూడా మిన‌హాయించాల‌ని, మ‌రో రెండేళ్ల వ‌ర‌కూ.. జీఎస్‌టీ నుంచి మిన‌హాయింపు ఇచ్చి, థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌ని ఇదుకోవాల‌ని కోరుతూ ఓ విన‌తీ పత్రాన్ని ప్ర‌భుత్వానికి అంద‌జేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు. మ‌రి కేసీఆర్ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ తెలంగాణలో డ్రగ్స్ కేసుల కలకలం !

హైదరాబాద్, సైబరాబాద్‌కు ఇప్పుడు ఉన్న కమిషనర్ల నేరస్తును ఓ ఆట ఆడిస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సైబర్ ఫ్రాడ్‌ల మీద దృష్టి పెడితే.. హైదరాబాద్ కమిషన్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసుల్ని వెలికి తీస్తున్నారు....

ఎన్నికల జిమ్మిక్ అనుకున్నా సరే.. ప్రధాని స్టైల్ అదే !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిపబ్లిక్ డే వేడుకల్లో భిన్నంగా కనిపించారు. భగత్ సింగ్ తరహా టోపీ..  ఓ విభిన్నమైన కండువాతో వేడుకల్లో పాల్గొన్నారు. టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉంది. కాసేపటికే నెటిజన్లు అవి ఎక్కడివో...

అదే నరసింహన్ గవర్నర్ అయితే ఇలా జరిగేదా !?

రిపబ్లిక్ డే రోజున కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కారణం ఏమిటంటే రాజ్‌భవన్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుక.. జెండా పండుగకు కేసీఆర్ వెళ్లలేదు. కనీసం సీనియర్...

“కొత్త జిల్లాల పని” చేస్తామంటున్న ఉద్యోగ సంఘాలు !

ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాలు భిన్నంగా స్పందించాయి. ఐఏఎస్‌లు మినహా ఉద్యోగలంతా సమ్మెలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close