చీలిక దిశగా “మా”

దారి తప్పిన “మా” ఎన్నికల వాతావరణం పుణ్యమా అని టాలీవుడ్ రెండుగా విడిపోయే పరిస్థితి వస్తోంది. “మా” కు వరుసగా రాజీనామా చేస్తున్న వాళ్లంతా కలిసి ప్రత్యేక అసోసియేషన్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు టాలీవుడ్‌లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కొత్త అసోసియేషన్‌లో సభ్యత్వం కావాలనుకునేవారు.. “మా” కు రాజీనామా చేసి రావాల్సి ఉంటుందనే నిబంధన పెట్టే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత అందరం ఒక్కటే అని మాట వరుసకు అనుకుంటున్నారు కానీ అందరూ వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.

గెలిచిన మంచు ప్యానల్ చిరంజీవిపై వ్యాఖ్యలు చేసింది . రామ్ చరణ్ ఓటు వేయలేదని విష్ణు నేరుగానే చెప్పారు. ఇలాంటి ప్రకటనలతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇప్పటికే “మా”లో చీలిక చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందరూ కలిసి వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే “మా” ప్రచారం సమయంలో ఏర్పడిన విబేధాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొంత మంది రాజీనామాలు చేస్తున్నారు. మరికొంత మంది “మా” రాజకీయాలపై విరక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు కొత్త కుంపటి పెట్టుకోవడానికి కొంత మంది రెడీ అయిపోతున్నారు.

ఇప్పుడు మోహన్ బాబు ముందున్న అసలు సమస్య అందర్నీ కలుపుకుని వెళ్లడమే. ఆ విషయంలో ఆయన ఎంత సక్సెస్ అవుతారో అనే దాన్నిబట్టే “మా” భవిష్యత్ కూడా నిర్ణయం అవుతుంది. లేకపోతే.. “మా” కు పోటీగా మరోకటి పుట్టుకు రావడం ఖాయమవుతుంది. అదే జరిగితే టాలీవుడ్లో నిట్ట నిలువునా చీలిక వచ్చినట్లవుతుంది. అది ఇండస్ట్రీకి ఏ మాత్రం మంచిది కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ప రిలీజ్ డేట్‌…. త‌గ్గేదే లే!

డిసెంబ‌రులో పెద్ద సినిమాల జాత‌ర రాబోతోంది. అఖండ‌తో డిసెంబ‌రు జోరు మొద‌లు కాబోతోంది. డిసెంబ‌రు 17న పుష్ప‌, ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ రాబోతున్నాయి. అయితే పుష్ప రిలీజ్‌కొంచెం క‌ష్ట‌మ‌ని, డేట్ మారే...

జాతీయ అవార్డు గ్ర‌హీత‌.. శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతి

తెలుగు చిత్ర‌సీమ మ‌రో ప్ర‌తిభావంతుడ్ని కోల్పోయింది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో క‌ళాకారుడ్ని బ‌లి తీసుకుంది. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న...

దేశంలో ఇక “ఒమిక్రాన్” అలజడి !

కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమానాల విషయంలో మాత్రం ఆంక్షలు విధించలేదు. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడిన దేశాల నుంచి...

సీఎస్‌గా సమీర్ శర్మ మరో ఆరు నెలలు !

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. బెంగాల్‌లో చీఫ్ సెక్రటరీ పొడిగింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ చీఫ్ సెక్రటరీల...

HOT NEWS

[X] Close
[X] Close